అల్లు అర్జున్ 'బద్రీనాధ్' లో బాలీవుడ్ స్టార్ హీరో?
అల్లు అర్జున్, వివి వినాయిక్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న 'బద్రీనాధ్' చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ నటించనున్నాడనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. మొదట ఈ పాత్రకు నవదీప్ ని అనుకున్నారని, అయితే చివరి నిముషంలో నిర్ణయం మార్చుకుని ఇమ్రాన్ ఖాన్ ని ట్రై చేస్తే బెటర్ అనే ఆప్షన్ కి వచ్చారని చెప్తున్నారు. అమీర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్ ని తీసుకోవంట ద్వారా హిందీ మార్కెట్ లో సైతం ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయటానికి వీలుంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నానాపటేకర్ ని సైతం తీసుకున్న సంగతి తెలిసిందే.
గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో ఇమ్రాన్ పాత్ర కోసం అమీర్ తో అల్లు అరవింద్ మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఇంకా ఈ చిత్రానికి పచ్చా జెండా ఊపలేదని, డేట్స్ చూసి చెప్తామని చెప్పినట్లు సమాచారం. చిన్ని కృష్ణ కధ అందిస్తున్న ఈ మాస్ ఓరియెంటెడ్ చిత్రంలో తమన్నా ఓ కీలకమైన పాత్రను చేస్తోంది. అపరిచితుడు, దశావతారం వంటి చిత్రాలకు కెమెరా అందించిన రవి వర్మ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. మగధీర చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కన్నన్ కూడా ఈ టెక్నికల్ టీమ్ లో ఉన్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పీరియడ్ మూవీగా తెరకెక్కనుంది.


Click it and Unblock the Notifications











