హాట్ హాట్ గా...రాఘవేంద్రరావు 'కొబ్బరి చిప్ప' యవ్వారం
ప్రతీసారి పళ్ళుతో హీరోయిన్ బొడ్డుని బ్యూటీఫుల్ గా చూపించే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దృష్టి ఈసారి కొబ్బరి చిప్పపై పడింది. పవిత్రంగా అనిపించే కొబ్బరి చిప్ప రాఘవేంద్రరావు పుణ్యమా అని సెక్స్ సింబల్ గా మారనుంది. ఝుమ్మందినాదం పోస్టర్స్ లోనూ, యాడ్స్ లోనూ ఎక్కువగా కొబ్బరి చిప్పను చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. దాంతో ఈ కొబ్బరి చిప్ప వ్యవహారం ఫిల్మ్ సర్కిల్స్ లోనే కాక బయిట కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కొబ్బరి చిప్ప అనేది కొన్ని ఏరియాల్లో ఆడవారిని శరీర భాగాలను పోలుస్తూ వాడతారు. అది దృష్టిలో పెట్టుకునే కొబ్బరి చిప్పను ప్రజెంట్ చేస్తున్నారంటున్నారు. రసికత తెలిసిన రాఘవేంద్రుడు ఈ రకంగా కొత్త జనరేషన్ ని రంజింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్ గా చేస్తోంది. ఆమె అందాలు ఇప్పటికే ఆంధ్రాని ఉవ్విళ్ళూడిస్తున్నాయి. మరో ప్రక్క సినిమావారు సైతం ఆమె అందాలను గమనించి...తమ ప్రక్కన బుక్ చేసుకునేందుకు లైన్ కడుతున్నారనేది తెలిసిన విషయమే.


Click it and Unblock the Notifications











