పిక్చర్స్: సల్మాన్‌పై మనసు పడిన దీపికా
ముంబై: తన సమకాలీన నటీమణుల మాదిరిగా కాకుండా దీపికా పడుకొనే చాలా తొందరగా ఫేమ్ సంపాదించుకుంది. చిన్న వయస్సులోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిదంి. షారూక్ ఖాన్ ఓం శాంతి ఓం చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో లిరిల్, క్లోజప్ యాడ్స్ చేసింది దీపికా పడుకొనే.
ఫర్హా ఖాన్ కన్నా ముందే తనకు సల్మాన్ ఖాన్ ఓ చిత్రంలో అవకాశం కల్పించడానికి ముందుకు వచ్చాడని, అయితే తాను దాన్ని తిరస్కరించానని దీపికా పడుకొనే ఓ ప్రముఖ పత్రికతో చెప్పింది. అప్పటికి తాను చాలా చిన్నదాన్నని, ఏ వృత్తిని ఎంచుకోవాలనే విషయంలో తాను స్పష్టంగా లేనని, దాంతో సల్మాన్ ఖాన్ ఆఫర్‌ను కాదన్నానని ఆమె వివరించింది.
గత వారం ఆమె 27వ పడిలో పడింది. సల్మాన్ ఖాన్‌తో తనకు నటించాలని ఉన్నట్లు ఆమె తెలిపింది. సల్మాన్ ఖాన్‌తో ఓ ప్రేమకథలో, మంచి రోమాంటిక్ ఫిల్మ్ చేయాలని తనకు ఉందని చెప్పింది. సల్మాన్ ఖాన్ పట్ల తనకు పెరుగుతున్న ఇష్టాన్ని ఆమె వ్యక్తం చేసింది.

దస్ కా దమ్ షోలో సల్మాన్ ఖాన్‌తో దీపికా పడుకొనే.

ఓం శాంతి ఓం చిత్రంలో ఏక్ చుక్తీ సిందూర్‌లో సల్మాన్‌తో దీపికా పడుకొనే.

దస్ కా దమ్‌లో సల్మాన్‌తో దీపికా పడుకొనే, ఫర్హా ఖాన్.

సల్మాన్ ఖాన్, దీపికా పడుకొనే.

మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్‌తో దీపికా పడుకొనే.


Click it and Unblock the Notifications











