Just In
- 43 min ago
దూరం నుంచే ఇడ్లి అమ్ముకునే తెలుగు వ్యక్తి కష్టాన్ని చూసి సహాయం చేసిన అజిత్.. ఎంత ఇచ్చాడంటే
- 1 hr ago
‘F3’లో మరో మెగా హీరో: ఊహించని పాత్రలో కనిపించి షాకివ్వనున్న స్టార్.. మరింత ఫన్ ఖాయం
- 1 hr ago
ముద్దు పెట్టలేదని వదిలేసింది.. పెళ్లి కంటే ముందే ఒక లవ్ స్టొరీ.. బ్రేకప్ గురించి చెప్పిన స్టార్ హీరో
- 2 hrs ago
బయటపడ్డ యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం: యంగ్ సింగర్‌తో అలా.. అందరి ముందే ప్రామిస్ చేయడంతో!
Don't Miss!
- Automobiles
వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]
- Sports
'స్పైడర్' పంత్ ఏదైనా చేయగలడు.. సిక్సులు కొట్టగలడు, క్యాచ్‌లు పట్టగలడు! పాట పడిన ఐసీసీ!
- Finance
ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, 2 రోజుల్లో రూ.750 పెరిగిన బంగారం: రూ.50,000 దిశగా..
- News
చిన్నారులకు నాజిల్ వ్యాక్సిన్ ఉత్తమం ; రానున్న రోజుల్లో బయో టెర్రరిజం ముప్పు : ఎయిమ్స్ డైరెక్టర్
- Lifestyle
GM డైట్ ఎందుకు పాటించకూడదో కొన్ని కారణాలు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లు హీరో మాటలకు హార్టయిన మెగా అల్లుడు.. పెళ్లి తెచ్చిన కొట్లాట?
మెగా ఫ్యామిలీ ఇటీవల నాగబాబు కూతురు నిహారిక పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో జరిగిన ఆ పెళ్లిలో 150మందికి మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నీహారిక, చైతన్య జోడి ఒక్కసారిగా స్టార్స్ మధ్యలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. లాక్ డౌన్ అనంతరం మొదటిసారి అందరు ఒకే చోట కలవడంతో పెళ్లి వేడుకను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.

అల్లు హీరో vs మెగా హీరో
ఇక ఆ పెళ్లి తరువాత మెగా ఫ్యామిలిలో మరో పెళ్లి కూడా జరగనున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఆ విషయంపై మెగా హీరో క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు అల్లు హీరో vs మెగా హీరో అనేలా కనిపించని గొడవ జరుగుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ మెగా హీరో మరెవరో కాదు. సాయి ధరమ్ తేజ్. జోక్ గా ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం ఇద్దరి మధ్య దూరం. పెంచినట్లు కథనాలు కూడా వస్తున్నాయి.

తనకంటే పెద్దవాడు శిరీష్
మొన్న ఒక ఇంటర్వ్యూలో నెక్స్ట్ మెగా ఫ్యామిలిలో జరగబోయే పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు. ముందుగా తన పెళ్లి జరగనున్నట్లు వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ నాది ఇప్పట్లో జరగదని కుండబద్ధలు కొట్టేశాడు. ఎందుకంటే తనకంటే పెద్దవాడు శిరీష్ ఉన్నట్లు తెలియజేశాడు.

సీరియస్ గా తీసుకోకండి
అయితే సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ కు ఒక విధంగా అల్లు శిరీష్ స్వీట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పెళ్లికి రెడీగా ఉన్న వారిలో అల్లు శిరీష్ మెగా ఫ్యామిలిలో ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి. అతని వయసు 33ఏళ్ళు. ఇక తేజ్ చేసిన కామెంట్స్ నిజమని అనుకుంటున్న తరుణంలో అతని మాటలు సీరియస్ గా తీసుకోవద్దని అంటూ శిరీష్ కుండబద్దలు కొట్టేశాడు.

నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా
ట్విట్టర్ ద్వారా శిరీష్ సరదగానే స్పందించాడు. 'హహహ.. తేజు నా పెళ్లి విషయంలో ఎదో జోక్ చేసినట్లు ఉన్నాడు. దాన్ని మీరు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించింది. నేను సింగిల్ గా ఉండేందుకు ఇష్ట పడుతున్నాను. ఆ విషయంలో మా అమ్మా నాన్న నుంచి కూడా ఇబ్బంది లేదు. నేను నాకు ఇష్టం కలిగినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేనే ఆ విషయాన్ని చెబుతాను' అంటూ ట్వీట్ చేశాడు శిరీష్.

రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా..
ఈ విషయం కొందరికి ఎలా అర్థమయ్యిందో తెలియదు గాని ఇద్దరి మధ్య కొంత మంట రాజేసుకున్నట్లు స్టోరీలు అల్లేస్తున్నారు. సాయి చేసిన కామెంట్ కు శిరీష్.. నీకెందుకు అన్నట్లుగా వివరణ ఇచ్చినట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వారి మధ్యన మనస్పర్థలు ఎంతవరకు వచ్చాయో తెలియదు గాని రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా మెగా హీరోలు మాత్రం స్పందించలేదు.