జూ ఎన్టీఆర్ పెళ్ళికి ఇన్ కమ్ టాక్స్ ప్రాబ్లమ్స్...
ఇటీవల టాలీవుడ్ హీరో నాగార్జున, ఇంటిపై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. తన స్నేహితురాలైన అనుష్క ఇంటిపై కూడా ఐటి దాడులు జరిగాయి. అల్లు అర్జున్ పెళ్ళి జరిగినప్పుడు కూడా ఐటి అధికారులు ఈ పెళ్ళిపై అంచనాలు వేసారని సమాచారం. కానీ ఐటీ దాడులు జరగకుండా చిరంజీవి, అల్లు అరవింద్ లు ముందు జాగ్రత్త చర్యలు చేసట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఐటి అధికారుల దృష్టి జూ ఎన్టీఆర్ పెళ్ళిపై పడిందని తెలుస్తోంది.
జూ ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిల పెళ్ళి కోసం నార్నే, నందమూరి కుటుంబాలు భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఈ ఖర్చును అంచనా వేసి ఐటి అధికారులు దాడులు జరిపే అవకాశముందని చాలా మంది భావిస్తున్నారు. కానీ చానెల్ అధిపతి అయిన నార్నే శ్రీనివాసరావు ఓ పక్కన, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ వైపున మరో వైపు కేంద్రమంత్రి హోదాలో దగ్గుబాటి పురందేశ్వరీ ఉండగా ఎన్టీఆర్ కి ఐటి దాడుల గురించి భయపడాల్సిన అవసరంలేదని పరిశీలకులు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











