Indian 3: ఇండియన్ 3 మూవీపై కొత్త పుకారు.. శంకర్‌ను వెంటాడుతున్న దురదృష్టం!
భారతీయ సినిమా గర్వించదగ్గ ఎంతోమంది స్టార్ దర్శకుల్లో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కూడా ఒకరు. ఎన్నో ఏళ్ల కితమే ఎంతో అడ్వాన్స్ గా అలోచించి సినిమాలు చేసిన శంకర్ ఇపుడు ఊహించని విధంగా డౌన్ ఫాల్ ని చూస్తున్నారు. కాగా ఇపుడు శంకర్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ అవుతున్నాయి.
మెయిన్ గా ఈ సినిమా ప్లాప్ తర్వాత నుంచి శంకర్ మార్కెట్ ఎంతో పడిపోయింది. మరి ఎట్టకేలకి మళ్ళీ శంకర్ తన మొదటి తెలుగు సినిమాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ తో మళ్ళీ ఫామ్ లోకి వస్తే తన నెక్స్ట్ సినిమాలకి అయినా పనికొస్తుంది అని టాక్ వచ్చింది. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం కూడా భారీ డిజాస్టర్ అయ్యింది.

ఇక శంకర్ పని అయిపోయినట్టే అని అర్ధం అయ్యిపోయింది. కాగా ఈ సినిమా ప్లాప్ తర్వాత శంకర్ నుంచి రావాల్సిన భారీ చిత్రమే "ఇండియన్ 3". ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేసిన ఇండస్ట్రీ హిట్ చిత్రం భారతీయుడు కి సీక్వెల్ గా గత ఏడాది భారతీయుడు 2 వస్తే దానికి పార్ట్ 3 కూడా చేసేసి మేకర్స్ సిద్ధంగా ఉంచుకున్నారు.
కానీ ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద చిక్కుగా మారిపోయింది. కాగా ఇండియన్ 2 ప్లాప్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ కి మంచి బజ్ వచ్చింది కానీ సినిమా విడుదల ఎప్పుడు ఏంటి అనేది సంశయమే.. అసలు వస్తుందా లేదా అనే సమయంలో స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందాలు ఇష్యూ ఇలా చాలానే ఇబ్బందులు శంకర్ కి ఎదురయ్యాయి.
దీనితో గేమ్ ఛేంజర్ అయినా హిట్ అయితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుందాం అనుకున్నారు కానీ అక్కడ చెట్టే కూలిపోయింది. ఈ తర్వాతే శంకర్ ఇండియన్ 3 థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం ఇపుడు డైరెక్ట్ ఓటిటిలో కాదు కదా థియేటర్స్ లో కూడా విడుదల అయ్యేలా లేదని షాకింగ్ బజ్ వినిపిస్తుంది.
నిజానికి ఈ సినిమాని కూడా నెట్ ఫ్లిక్స్ కొనుకోవాలని చూసారు కానీ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ తో శంకర్ ని నమ్మలేక ఇపుడు ఇండియన్ 3 వీరు సహా ఏ ఓటిటి కూడా నిర్మాతలకి డీల్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదట. దీనితో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు నిస్సాయ స్థితిలో ఉండిపోయారట. ఇలా ఈ సినిమా ఓటిటి లోనే కాకుండా కనీసం థియేటర్స్ లో కూడా వచ్చే పరిస్థితి ఇప్పుడే కాదు ఎప్పటికీ లేదని తెలుస్తుంది. ఇది మాత్రం ఊహించని ట్విస్ట్ అని చెప్పక తప్పదు. మరి ఈ సినిమా విషయంలో చివరికి ఏమవుతుందో చూడాలి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











