అనిరుధ్ పై విమర్శలు.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా చేశాడంటూ!
ఇండియాస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 21 ఏళ్లలోనే సంగీత దర్శకుడిగా మారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మొదలై ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండియాలోని బిగ్ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తూ ఉన్నారు. క్యాచీ ట్యూన్, మాస్ బీట్స్, స్టార్ హీరోల క్రేజ్ తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేస్తూ సెన్సేషన్ గా మారారు. ఇప్పటి వరకు ఆయన వర్క్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ పరంగా హిట్ అందుకోవడం విశేషం. అనిరుధ్ నుంచి వచ్చే సాంగ్స్ పై ప్రేక్షకుల్లో ఎంతో నమ్మకం, ఆసక్తిని ఉండేలా చేశారు. కానీ తాజాగా ఆయన కూలి, కింగ్డమ్ చిత్రాల ద్వారా విమర్శలను అందుకుంటున్నారు.
ఇక అనిరుధ్ రవిచందర్ 13 ఏళ్లుగా మ్యూజిక్ వరల్డ్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన రొమాంటిక్ ఫిల్మ్ 3 చిత్రానికి తొలుత అనిరుధ్ సంగీతం అందించారు. 2012లో విడుదలైన ఆ సినిమా సాంగ్స్ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లే లిస్ట్ లో మోగుతూనే ఉన్నాయి. రఘువరన్ బీటెక్, కత్తి, మారి, రెమో, నేనూ రౌడీనే వంటి ప్రాజెక్ట్స్ తో సౌత్ లో అనిరుధ్ పేరు మారుమోగింది. దీంతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక తెలుగులోనూ పవన్ కళ్యాణ్ అజ్హాతవాసి, యూటర్న్, జెర్సీ, గ్యాంగ్ లీడర్, దేవర వంటి ప్రాజెక్ట్స్ కు వర్క్ చేశారు.

రెండేళ్లుగా అనిరుధ్ విక్రమ్, తిరు, జైలర్, జవాన్, లియో వంటి ప్రాజెక్ట్స్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఇండియా షేక్ అయ్యింది. ముఖ్యంగా జైలర్ లో ప్రతి క్యారెక్టర్ కు ఇచ్చిన డిటేయిల్డ్ మ్యూజిక్, సాంగ్స్ సెన్సేషన్ గా మారాయి. జవాన్ తోనూ మరింత సంచలనం సృష్టించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవరకు కూడా అదిరిపోయే వర్క్ అందించారు. కానీ తాజాగా వచ్చిన రజనీకాంత్ కూలి చిత్రం విషయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నచ్చలేదని కొందరు ప్రేక్షకులు తెలుపుతున్నారు. అనిరుధ్ మార్క్ కనిపించ లేదని అభిప్రాయపడుతున్నారు. కానీ సాంగ్స్ విషయంలో దుమ్ములేపారని అంటున్నారు.
అలాగే విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రానికి అయితే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ నిరాశ పరిచాయని ఆడియెన్స్ చెప్పడం గమనార్హం. ఆయన కెరీయర్ లో అంత్యంత భారీ అంచనాలతో వచ్చిన కూలి చిత్రానికి మరింత శ్రద్ధ వహించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇక అనిరుధ్ నెక్ట్స్ మ్యాజిక్, మదరాసి, లవ్ ఇన్స్సూరెన్స్ కంపనీ, జన నాయగన్, ది పారడైస్, జైలర్ 2, కింగ్ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిపై భారీ అంచనాలు ఉన్నాయి.
రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న కోలీవుడ్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కూలి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 370 కోట్ల రూపాయలతో సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, పూజా హెగ్దే, అమీర్ ఖాన్ అలరించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద 65 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూల్ చేసింది. మున్ముందు ఎంత వసూల్ చేస్తుందనేది చూడాలి.


Click it and Unblock the Notifications











