అనుష్క శర్మ గర్భం దాల్చిందా? కోహ్లి తండ్రి కాబోతున్నాడా?
బాలీవుడ్ నటి అనుష్క శర్మ గర్భం దాల్చిందా? త్వరలో విరాట్ కోహ్లి తండ్రి కాబోతున్నాడా? అంటే అవును అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో అనుష్క కుర్చీపై నుంచి లేచి నిల్చోవడానికి ఇబ్బంది పడటం, లూజ్‌గా ఉన్న డ్రెస్ వేసుకోవడంతో... ఆమె గర్భం దాల్చిందనే వార్తలు జోరందుకున్నాయి.
అనుష్క తాజా మూవీ కోస్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను గ్రీట్ చేయడానికి వచ్చిన వారికి లేచి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కుర్చీ లో నుండి లేవడానికి అనుష్క ఇబ్బంది పడటంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే కొందరి వాదన ఇంకోలా ఉంది. అనుష్క కొన్ని రోజులుగా బ్యాక్ పెయిన్‌తో బాధ పడుతోందని, అందుకే కుర్చీ నుంచి లేచి నిల్చోవడానికి ఇబ్బంది పడిందని అంటున్నారు. ఇదే కార్యక్రమంలో వరుణ్ ధావన్ కూడా ఆమె ఇంజురీ గురించి మాట్లాడారు. నొప్పి బాధిస్తున్న ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారని వ్యాఖ్యానించారు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది అనుష్క గర్భం దాల్చిందనే విషయాన్ని నమ్ముతున్నారు. కొందరైతే ఏకంగా అనుష్క, విరాట్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనుష్క గర్భం దాల్చిందనే ప్రచారం జరిగింది. మరి ఈ సారైనా ఇది నిజం అవుతుందో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











