పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్.. వందలాది రాక్షసుల మధ్యన ఒక్కడే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ గా సినిమాలు చేయడం ఒక ఎత్తైతే.. సినిమా సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా ప్లాన్ చేసుకోవడం మరొక ఎత్తు. పవన్ తక్కువ సమయంలో ఫినిష్ చేసేలా సినిమాలను సెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఎక్కువగా అందరి ఫోకస్ కూడా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హిస్టారికల్ డ్రామాపైనే ఉంది. ఆ సినిమాకు సంబంధించిన లీక్స్ గురించి వింటుంటే రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ సీన్ షూటింగ్ కు ప్లాన్ సిద్ధమైంది.

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..

వీలైనంత వరకు ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్లుగానే పవన్ ను ప్రజెంట్ చేయడానికి దర్శకులు ప్రయత్నాలు చేస్తారు. ప్రస్తుతం వకీల్ సాబ్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారో గాని అంతకంటే ఎక్కువగా మాత్రం ఆ తరువాత వచ్చే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ఇక క్రిష్ అయితే పవన్ సినిమా కోసం నెవర్ బిఫోర్ అనేలా కష్టపడుతున్నాడు.

 పక్కా ప్లానింగ్ తో..

పక్కా ప్లానింగ్ తో..

క్రిష్ హిస్టారికల్ సినిమాలను ఎంత తొందరగా పూర్తి చేస్తాడో ఇదివరకే ఒకసారి ఋజువయ్యింది. గౌతమిపుత్ర శతకర్ణి సినిమా సినిమాను పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికి పూర్తి చేయడంతో అతని పని తీరుకు అగ్ర దర్శకులే షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ తో కూడా పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగాడు.

షూటింగ్ తొందరగా పూర్తయ్యేలా..

షూటింగ్ తొందరగా పూర్తయ్యేలా..

వకీల్ సాబ్ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ తో బిజీ అయ్యాడు. ఆ సినిమా కోసం కేవలం 40రోజుల కాల్షీట్స్ ఇచ్చిన పవన్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పిరియాడిక్ స్టోరీని కూడా తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. అప్పట్లో ఆ సినిమా కోసం పవన్ కోర మీసాలు పొడవు జుట్టు కూడా పెంచాడు.

పవన్ హై వోల్టేజ్ యాక్షన్..

పవన్ హై వోల్టేజ్ యాక్షన్..

ఇక సినిమాలో యాక్షన్ సీన్స్ కు ఏ మాత్రం లోటు ఉండదని తెలుస్తోంది. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సరిహద్దుల్లో 150ఎకరాల ఖాళీ స్థలంలో హై వోల్టేజ్ వార్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు టాక్. పవన్ ఒక్కడి చుట్టూ వందలాది మంది విలన్స్ ఉంటారని తెలుస్తోంది. వాళ్ళు అతి భయంకరమైన గెటప్పుల్లో రాక్షసుల మాదిరిగా ఉంటారని, కాస్ట్యూమ్స్, మేకప్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

15 నిమిషాల పాటు..

15 నిమిషాల పాటు..

సినిమా క్లైమాక్స్ సీన్ కు ముందుగా వచ్చే ఆ యాక్షన్ ఎపిసోడ్ 15 నిమిషాల పాటు ఉంటుందట. విజువల్ ఎఫెక్ట్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని సమాచారం. ఇక సినిమా టైటిల్ ను హరహర మహాదేవ అని ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా పక్కా సమాచారం అందుతోంది. కుదిరితే టైటిల్ లో కొద్దిపాటి మార్పులు చేసి హరిహర వీరమల్లు అని ఫిక వహేసి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X