ఉత్కంఠ రేపుతున్న 2.ఓ .. అక్షయ్ కుమార్ మరణించిన తరువాతే!
Recommended Video

నవంబర్ నెలాఖరులో 2.0 చిత్రం రూపంలో అతిపెద్ద సినిమా బాంబు పేలబోతోంది. నవంబర్ 29న శంకర్, రజని, అక్షయ్ కుమార్ భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ విడుదల కాబోతోంది. ఇటీవల ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో విజువల్స్ అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉండబోతోందో ట్రైలర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ చిత్ర కథ గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

ఆసక్తికర అంశంతో
2.ఓ చిత్రం అంటే అల్ట్రా టెక్నికల్ అంశాలే కాదు సూపర్ నాచురల్ అంశాలు కూడా కథలో భాగంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఒక అక్షయ్ కుమార్ కేంద్రంగా అద్భుతమైన కథ అల్లినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ పాత్ర వలెనే ఈ కథ జరుగుతుందని అంటున్నారు.

అక్షయ్ కుమార్ మరణంతోనే
2.ఓ కథ ఇదే అంటూ జరుగుతున్న ప్రచారం ప్రకారం.. సాధారణ మానవుడిగా ఉండే అక్షయ్ కుమార్ మొబైల్ ఫోన్ వలన మరణిస్తాడట. ఆ తరువాత దుష్ట శక్తిగా మారుతాడని.. అసలు కథ అప్పుడే ప్రారంభం అవుతుందని అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడడం వలన మరణించిన అక్షయ్ కుమార్ కు వాటిపై ద్వేషం పెరుగుతుందని అంటున్నారు.

అద్భుతమైన సందేశం
అక్షయ్ కుమార్ పాత్రతో శంకర్ ఓ అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారడం ఎంత ప్రమాదకరమో 2.ఓ చిత్రం ద్వారా తెలియజేయనున్నాడట. ట్రైలర్ లో మొబైల్ వాడుతున్నవారంతా హంతకులే అంటూ అక్షయ్ చెబుతున్న డైలాగ్ అందరిని ఆకట్టుకుంది.

అమీ జాక్సన్ లేడి రోబో
ఈ చిత్రంలో హీరోయిన్ నటిస్తున్న అమీ జాక్సన్ కూడా లేడి రోబోగా కనిపించనుంది. చిట్టి, సూపర్ విలన్ అక్షయ్ కుమార్ మధ్య జరిగే పోరాటాల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











