బోయపాటి, బాలయ్య సినిమా.. వైరల్ అవుతున్న న్యూస్, అంతకు మించి ఉండేలా!
క్రేజీ దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. చాలా రోజులుగా బాలయ్య హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బోయపాటి శ్రీను సింహా లాంటి సూపర్ హిట్ ని అందించాడు. ఆ తరువాత లెజెండ్ రూపంలో మరో బ్లాక్ బస్టర్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

టాప్ హీరోల రేంజ్‌లో
బాలయ్యతో తెరకెక్కించబోతున్న హ్యాట్రిక్ చిత్రానికి బోయపాటి కళ్ళు చెదిరే పారితోషకం అందుకుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బోయపాటి 15 కోట్ల వరకు పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి పారితోషకంపై టాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. పైగా బాలయ్య సొంత బ్యానర్ ఎన్బీకే ఫిలిమ్స్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుండడం కూడా బోయపాటి భారీ పారితోషకానికి కారణం అని అంటున్నారు.

ఫిబ్రవరిలో పార్రంభం
బోయపాటి శ్రీని ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నేను, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న మరో చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మీకు మరిన్ని విశేషాలు తెలియజేస్తాం అని బోయపాటి తెలిపాడు. నా ప్రతి చిత్రం కోసం నేను సర్వశక్తులు ఒడ్డుతాను అని బోయపాటి అన్నారు.

అంతకి మించి ఉండేలా
లెజెండ్, సింహా చిత్రాల్ని మించేలా ఉంటుందని నందమూరి అభిమానులకు బోయపాటి హామీ ఇచ్చారు. నాకు రాయడం, తీయడం మాత్రమే తెలుసు. ఆ పనిని బాగా చేస్తా అని తెలిపారు. బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు.

వినయ విధేయ రామ
ఇక బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో తెరకెక్కిస్తున్న వినయ విధేయ రామ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కూడా సంక్రాంతి సందర్భంగానే విడుదలవుతోంది. వినయ విధేయ రామ చిత్రం విడుదల కార్యక్రమాలు పూర్తి కాగానే బోయపాటి బాలయ్య చిత్రంతో బిజీ కానున్నాడు.


Click it and Unblock the Notifications











