వినాయక్ చివరి చిత్రం ఇదేనా.. నందమూరి హీరోతో!

దర్శకుడు వివి వినాయక్ కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు. వివి వినాయక్ దర్శత్వంలో ఎన్నో పవర్ ఫుల్ చిత్రాలు వచ్చాయి. హీరో ఇమేజ్‌కు తగ్గట్లుగా కమర్షియల్ అంశాలు జోడించి హిట్ కొట్టడంలో వివి వినాయక్‌ది అందెవేసిన చేయి. వినాయక్ తిరుగులేని దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం అయ్యారు అందుకే వివి వినాయక్‌కు ఇటీవల సరైన విజయం లేదు. వివి వినాయక్ తెరకెక్కించిన మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150 చిత్రం ఘనవిజయం సాధించినా.. ఆ తరువాత వచ్చిన ఇంటెలిజెట్ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది.

 చివరి చిత్రం

చివరి చిత్రం

తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం వివి వినాయక్ తన కెరీర్ లో చివరి చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కెరీర్ ముగింపు చిత్రంగా ఓ పవర్ ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాలని వివి వినాయక్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో చిత్రం మరో మారు తెరపైకి వచ్చింది.

పవర్ ఫుల్ చిత్రాలు

పవర్ ఫుల్ చిత్రాలు

వివి వినాయక్ నందమూరి కుటుంబానికి పవర్ ఫుల్ చిత్రాలు అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆది, సాంబ, అదుర్స్ వంటి చిత్రాలు తెరేక్కించారు. బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి చిత్రాన్ని రూపొందించారు. మరో మారు వివి వినాయక్, బాలయ్య కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం నిర్మాత సి కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జనసేన పార్టీ తరుపున

జనసేన పార్టీ తరుపున

వివి వినాయక్ చివరి చిత్రం ఇదే అని ప్రచారం మొదలు కావడానికి ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. ఆయన రాజకీయాల్లో బిజీ కాబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం వివి వినాయక్ జనసేన పార్టీ తరుపున 2019 లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికలలోపు ఓ బాలయ్య చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ హీరోలందరితో

సీనియర్ హీరోలందరితో

వివి వినాయక్ టాలీవుడ్ లోని సీనియర్ హీరోలందరికీ విజయాలు అందించాడు. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నెం 150 చిత్రాలు తెరకెక్కించాడు. వెంకటేష్‌తో లక్ష్మి, రవితేజతో కృష్ణ చిత్రాన్ని తెరకెక్కించారు. వివి వినాయక్ చివరి చిత్రం అంటూ వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనా లేక ఇందులో వాస్తవం ఉందా అనే విషయం తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X