పేదింటి అమ్మాయితో ప్రేమలో ప్రభాస్.. అసలు కథ ఇదే!
Recommended Video

యంగ్ రెబల్ ప్రభాస్ ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. సాహో లాంటి భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తూనే దర్శకుడు రాధాకృష్ణతో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాలు 2019లోనే విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018లో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా నిరాశపరిచిన ప్రభాస్ వచ్చే ఏడాది మాత్రం డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ప్రభాస్ ని అభిమానులు యాక్షన్ హీరోలా చూడాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే సాహో రూపొందితోంది. కానీ కొంత చేంజ్ కోసం రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమ కథగా రాబోతోంది. ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

బాగానే కలిసొచ్చాయి
ప్రభాస్ కు యాక్షన్ చిత్రాలు ఎంతగా అలరిస్తాయో ప్రేమ కథలు కూడా అదేస్థాయిలో కలసి వచ్చాయి. ప్రభాస్ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ వర్షం ప్రేమ కథ కావడం విశేషం. ఆ తరువాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో కూడా ప్రభాస్ లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. ప్రభాస్ కు మహిళల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వారిని కూడా సంతృప్తి పరచడానికి చాలా రోజుల తరువాత ప్రభాస్ ప్రేమ కథని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

పేద అమ్మాయి ప్రేమలో
ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్లో తెరక్కుతున్న ఈ చిత్రం 1960 నేపథ్యంలో ప్రేమ కథగా సాగుతుందట. ఈ చిత్రంలో ప్రభాస్ ధనవంతుడైన కార్ల వ్యాపారిగా కనిపిస్తాడని సమాచారం. ధనవంతుడిగా విలాసవంతమైన జీవితాన్ని గడిపే ప్రభాస్ ఈ చిత్రంలో ఓ పేద యువతి ప్రేమలో పడతాడట. అంత ధనవంతుడైన ప్రభాస్ ఆయువతి ప్రేమలో పడడానికి కారణం ఏంటి ? ఆ తర్వాత పరిస్థితులు ఎలా దారితీశాయి అనేదే ఈ చిత్ర కథ.

సరికొత్త లుక్
ప్రభాస్ ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో నడిపించబోతున్నాడు. బాహుబలి చిత్రంలో రాజులకాలం నాటి ఆహార్యంతో మెప్పించిన ప్రభాస్ సాహో చిత్రంలో స్టైలిష్ లుక్ లోకి మారాడు. రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1960 కాలం నాటిది కావడంతో ప్రభాస్ బరువు తగ్గి కనిపించబోతున్నాడట. బాహుబలి తరువాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అని భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

పూజ హెగ్డేతో రొమాన్స్
ఈ చిత్రంలో పేదింటి అమ్మాయిగా నటిస్తున్నది ఎవరో కాదు. క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే. డీజే, అరవింద సమేత లాంటి చిత్రాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సరసన, మహేష్ సరసన మహర్షి చిత్రాల్లో నటిస్తోంది. రాధాకృష్ణ చిత్రానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











