సిన్సియర్ లవర్‌గా ప్రభాస్.. కొత్త సినిమా గురించి క్రేజీ న్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జోడిగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ఇటలీలో ప్రాంభమైంది. 1960. 70 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

డ్యూయెల్ రోల్
ప్రభాస్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం. 1960 కాలంలో ప్రభాస్, పూజ హెగ్డే మధ్య ప్రేమ సాగుతుందట. దానికి పార్లల్ గా ప్రస్తుత కాలంలో కూడా మరో కథ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. దీని కోసం ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ కథలో ప్రభాస్ కు జోడిగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది.

సిన్సియర్ లవర్
ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఓ పాత్రలో సిన్సియర్ లవర్ గా కనిపిస్తాడు. మరో పాత్రలో ప్లే బాయ్ లా ఉంటాడని అంటున్నారు. ప్రభాస్ ప్లే బాయ్ పాత్రకు జోడిగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరగనునట్లు తెలుస్తోంది.

వింటేజ్ కార్లు
1960 కాలంలో జరిగే కథలో ప్రభాస్ వింటేజ్ కార్ల సంస్థకు అధిపతిగా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాధాకృష్ణ అన్ని అంశాలతో అద్భుతమైన కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యూవీక్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జిల్ చిత్రం తర్వాత రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చితం ఇదే.

రెడీ అవుతున్న సాహో
ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం సాహో. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హై టెక్నికల్ వాల్యూస్, 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎవిలిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











