సన్నాఫ్ సత్యమూర్తిలా ఉందే.. బన్నీ, త్రివిక్రమ్ సినిమా టైటిల్ గురించి రూమర్స్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, రాధాకృష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం తన లుక్ మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జనవరిలోనే ఈ చిత్రానికి ప్రకటన జరిగింది. కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఫాదర్ సెంటిమెంట్
త్రివిక్రమ్ చిత్రాల్లో ఎక్కువగా ఫ్యామిలీ ఎమిషన్స్ కనిపిస్తుంటాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఆ కోవకు చెందినదే. ఈ చిత్రంలో త్రివిక్రమ్ తండ్రి సెంటిమెంట్ ని చాలా బలంగా పండించాడు. దీనితో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది. త్వరలో పట్టాలెక్కబోతున చిత్రం గురించి కూడా ఈ తరహా వార్తలే వస్తున్నాయి. బన్నీ కోసం త్రివిక్రమ్ మరో ఫాదర్ సెంటిమెంట్ కథని సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది.

ఆ టైటిల్ నిజమేనా
ఈ చిత్ర టైటిల్ కు సంబంధించిన వార్తలు ఆసక్తికాగా మారాయి. త్రివిక్రమ్ 'నాన్న నేను' అనే టైటిల్ పరిశీలిస్తూనట్లు తెలుస్తోంది. వినగానే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని గుర్తు చేసేలా ఉన్నా ఈ టైటిల్ ని బన్నీ ఒకే చేస్తాడో లేదో చూడాలి. నా పేరు సూర్య చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ చివరగా త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ ని ఒకే చేశాడు. వీళ్లిద్దరి గత చిత్రాల రికార్డ్ దృష్ట్యా ఈ హ్యాట్రిక్ మూవీపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇద్దరు హీరోయిన్లు
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డే, కేథరిన్ ఇద్దరూ బన్నీకి హీరోయిన్లుగా నటించనున్నారు. చిత్ర యూనిట్ ఇంతవరకు ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సంగీత దర్శకుడి విషయంలో కూడా సందిగ్దత కొనసాగుతోంది. త్రివిక్రమ్ మరోమారు తమన్ ని రిపీట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరో హ్యాట్రిక్
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ మరో హ్యాట్రిక్ కు సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న బన్నీ సుకుమార్ తో కూడా మూడో చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 చిత్రాలు వచ్చాయి. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయ్యాక సుకుమార్ చిత్రాన్ని బన్నీ ప్రారంభించనున్నాడు.


Click it and Unblock the Notifications











