RC 15: ఫ్లాష్ బ్యాక్ లో ఆసక్తికరమైన ఎపిసోడ్.. పవర్ఫుల్ ఫ్రీడమ్ ఫైటర్ సర్‌ప్రైజ్ సీన్స్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తదుపరి సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని ఎదురుచూస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 15వ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు గురించి తరచుగా ఏదో ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
చిత్ర యూనిట్ సభ్యులు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విషయమైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ముఖ్యంగా షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ కాకుండా చూసుకోవాలని అనుకున్నారు. ఆ మధ్యకాలంలో ఎవరైనా లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే చర్యలు కూడా తీసుకుంటాము అని చిత్ర యూనిట్ సభ్యులు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లీకులు అయితే తగ్గడం లేదు.

ఇక ప్రస్తుతం మరొక టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అందులో రామ్ చరణ్ ఫ్రీడమ్ ఫైటర్ ను చూసి పూర్తి పొందే సన్నివేశాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి అని తెలుస్తుంది. రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశంలో ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ పాత్రలో ఒక ప్రముఖ నటుడు కూడా కనిపిస్తాడు అని సమాచారం. ఇక సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఎంతగానో టచ్ చేసే విధంగా ఉంటాయని ఆ సన్నివేశాలు తర్వాత రామ్ చరణ్ స్ఫూర్తి పొందే సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు శంకర్ ఆ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అసలైతే 2023 సంక్రాంతికి ఈ సినిమాలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు ఆలస్యం అవుతుండడంతో 2023 ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











