twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు సినిమా టైటిల్ ఇంత ఫన్నీగానా.. అనిల్ రావిపూడి ఏం చేస్తున్నాడు!

    |

    సూపర్ స్టార్ మహేష్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తాడు. మహేష్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే మహేష్ కు కథ చెప్పి ఒప్పించడానికి చాలా మంది దర్శకులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం మహర్షి చిత్రంలో వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి కథ వినిపించగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

    సుకుమార్ దర్శత్వంలో

    సుకుమార్ దర్శత్వంలో

    వంశీ పైడిపల్లి తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శత్వంలో నటించాలని భావించాడు. కానీ ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలా ఉండడంతో అనిల్ రావిపూడి రేసులోకి వచ్చాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగు వరుస సూపర్ హిట్స్ తో అనిల్ రావిపూడి కూడా స్టార్ డైరెక్టర్లు లీగ్ లో ఎంటర్ అయిపోయాడు.

    ఫన్నీ టైటిల్

    ఫన్నీ టైటిల్

    అనిల్ రావిపూడి, మహేష్ బాబు ప్రాజెక్ట్ విషయంలో మరో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ అనే ఫన్నీ టైటిల్ తో ఈచిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాల్లో టైటిల్స్ అంత పవర్ ఫుల్ గా ఉండవు. కంటెంట్ కూడా వినోదాత్మకంగా ఉంటుంది. మహేష్ చిత్రానికి వాట్సాప్ అనే టైటిల్ వినిపిస్తుండడంతో అనిల్ రావిపూడి ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడో అని ఫాన్స్ లో ఆసక్తి పెరుగుతోంది.

    దూకుడు తరహాలో

    దూకుడు తరహాలో

    ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరో ప్రచారం కూడా జరుగుతోంది. అనిల్ రావిపూడి అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన దూకుడు లాంటి కథని సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి మహేష్ బాబు దూకుడు తర్వాత ఆ స్థాయిలో ఉండే ఎంటర్ టైనింగ్ మూవీ చేయలేదు. శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి చిత్రాలు వచ్చినా అవి సందేశాత్మక చిత్రాలు. దీనితో మహేష్ బాబులోని కామెడీ టైమింగ్ ని ఫాన్స్ మిస్ అవుతున్నారు. అనిల్ రావిపూడి ఆ లోటు తీర్చబోతున్నట్లు తెలుస్తోంది.

    ఏప్రిల్‌లో మహర్షి

    ఏప్రిల్‌లో మహర్షి

    మహర్షి చిత్రం తర్వాత అనిల్, మహేష్ చిత్రం ప్రారంభం కానుంది. మహర్షి చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు విదేశాల్లో ఉండే కార్పొరేట్ సంస్థ సీఈవోగా కనిపించబోతున్నాడు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత. అశ్విని దత్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Interesting and funny title for Mahesh babu and Anil Ravipudi movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X