ముఖ్యమంత్రిగా బాలయ్య.. బోయపాటి పవర్ ఫుల్ స్టోరీ!

దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ చిత్రం నిరాశపరిచింది. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ చిత్రం రాంచరణ్ అభిమానులని ఆకట్టుకోలేక పోయింది. ఇక బోయపాటి తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. బాలయ్యతో హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అవుతున్నట్లు బోయపాటి శ్రీను గతంలోనే ప్రకటించాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా హ్యాట్రిక్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

ఈ నెలలోనే ప్రారంభం

ఈ నెలలోనే ప్రారంభం

బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్య చిత్ర కథపై కసరత్తు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. లెజెండ్, సింహ చిత్రాలని మించే రేంజ్ లో బోయపాటి శ్రీను ఈ చిత్ర కథని పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి అభిమానులంతా బాలయ్య, బోయపాటి చిత్రం కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు.

ముఖ్యమంత్రి పాత్రలో

ముఖ్యమంత్రి పాత్రలో

ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాలయ్య నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయని.. ఆ తరహాలో బోయపాటి కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మహానాయకుడు విడుదలయ్యాక

మహానాయకుడు విడుదలయ్యాక

బాలయ్య తన తండ్రి పాత్రలో నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని రెండవ భాగం మహానాయకుడు త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక బాలయ్య బోయపాటి చిత్రంపై దృష్టిపెట్టనున్నాడు. ఈ లోపు బోయపాటి నటీనటుల ఎంపిక, లొకేషన్స్ ఎంపిక లాంటి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

 హిట్ లేని సమయంలో

హిట్ లేని సమయంలో

బాలయ్య చాలా కాలం పాటు సరైన విజయం లేక తడబడుతున్న సమయంలో బోయపాటి శ్రీను సింహా చిత్రాన్ని రూపొందించి సూపర్ హిట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను సరైనోడు తర్వాత ఆ స్థాయి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X