Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆమెకు డబ్బు పిచ్చి, దర్శకుడు తేజ అధిక ప్రాధాన్యత.. హీరోయిన్‌పై వస్తున్న రూమర్స్!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్దానికి పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కోనసాగుతోంది. కాజల్ దాదాపుగా సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. చిరంజీవి నుంచి మొదలు పెడితే పవన్, మహేష్, ఎన్టీఆర్, విజయ్, చరణ్, ప్రభాస్, బన్నీ ఇలా స్టార్ హీరోలందరిని చుట్టేసింది. మునుపటిలా ప్రస్తుతం కెరీర్ లో జోరు లేకున్నా మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వరకు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ గా నటించి మెప్పించిన కాజల్ ప్రస్తుతం తాను నటించే చిత్రాల విషయంలో వైవిధ్యాన్ని కోరుకుంటోందట. తేజ దర్శత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ సరసన మరోమారు కాజల్ నటిస్తోంది.
ఎమోషనల్ రోల్
కాజల్ అగర్వాల్ గత ఏడాది తేజ దర్శత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎమోషన్ తో కూడుకున్న సన్నివేశాల్లో కాజల్ అగర్వాల్ అద్భుతంగా నటించింది. ఈ చిత్రంతోనే తేజ చాలా కాలం తర్వాత విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తేజ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఓ చిత్రాన్ని చేస్తున్నారు.
ప్రేమలో పడిన కాజల్ అగర్వాల్.. ఎవరితో డేటింగ్ చేస్తున్నారంటే..
ఆమెకు డబ్బు పిచ్చి
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కెరీర్ లో ఇంతకు ముందెన్నడూ చేయని పాత్ర చేయబోతోంది. కాజల్ అగర్వాల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ డబ్బు పిచ్చి ఎక్కువగా ఉండే అమ్మాయిలా ఈ చిత్రంలో కనిపించబోతోంది రూమర్ వినిపిస్తోంది. కాజల్ నెగిటివ్ రోల్స్ ఇంతవరకు చేయలేదు. దశాబ్దానికి పైగా గ్లామర్ రోల్స్ చేస్తూనే ఉంది. దీనితో ఇక రూటుమార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందట.
కాజల్ పేరు మీదే
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర పేరు సీత. చిత్రానికి ఇదే టైటిల్ గా కూడా తేజ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహకాలు చేస్తున్నారు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా ఈ చిత్రం చాలా కీలకం. వరుస పరాజయాలతో ఈ యువహీరో సతమతమవుతున్నాడు.
క్రేజీ ఆఫర్స్
కాజల్ అగర్వాల్ కు ఇటీవల క్రేజీ ఆఫర్ అందుకుంది. శంకర్, కమల్ హాసన్ సూపర్ హిట్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు క్వీన్ తమిళ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ లో కూడా కాజల్ నటిస్తోంది. ఇది లేడి ఓరియంటెడ్ చిత్రం కావడం విశేషం.