అడవుల్లో మహేష్ బాబు ప్రతీకారం, సుకుమార్ ప్రయోగం.. ఎన్టీఆర్, చరణ్‌లాగా గడ్డం పెంచితే!

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండనుంది. రంగస్థలం చిత్రం విజయం సాధించగానే మహేష్, సుకుమార్ కాంబోలో రెండో చిత్రానికి ప్రకటన జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. సుకుమార్ రూపొందించే కథలు ఆసక్తికరంగా, వైవిధ్యంగా ఉంటాయి. మహేష్ కోసం డిఫెరెంట్ జోనర్ లో సుకుమార్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

 విభిన్న కథలు

విభిన్న కథలు

దర్శకుడు సుకుమార్ ప్రేమ కథ తెరకెక్కించినా అందులో ఏదో ఒక డిఫెరెంట్ పాయింట్ ఉంటుంది. ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ఉండేలా సుకుమార్ జాగ్రత్త పడుతారు. అందుకే సుకుమార్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. నాన్నకు ప్రేమతో చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్న సుకుమార్.. ఆ తర్వాత రాంచరణ్ తో తెరకెక్కించిన రంగస్థలంతో రికార్డులు తిరగరాశారు.

మహేష్‌తో మరోసారి

మహేష్‌తో మరోసారి

మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 1 నేనొక్కడినే చిత్రం నిరాశపరిచింది. ఆ చిత్రంలో మహేష్ పాత్ర, ట్విస్ట్ లు గజిబిజిగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అలాంటి తప్పిదాలు మరోమారు పునరావృతం కాకుండా సుకుమార్, మహేష్ బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుకుమార్ మహేష్ కోసం ఓ పీరియాడిక్ డ్రామాని సిద్ధం చేశాడు. ఆ కథ అంతగా మహేష్ కు నచ్చకపోవడంతో మరో కథ రెడీ చేయమని చెప్పాడట. దీనితో సుకుమార్ విభిన్నమైన జోనర్ లో మరో కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అడవుల్లో ప్రతీకారం

అడవుల్లో ప్రతీకారం

మహేష్ కోసం సుకుమార్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రివెంజ్ డ్రామాని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం సన్నివేశాలు అడవుల్లో ఉంటాయట. ఈ చిత్రం కోసం మహేష్ లుక్ మొత్తం మార్చాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ లుక్ లో కాకుండా ఈ కథకు అనుగుణంగా రఫ్ లుక్ లో మహేష్ కనిపించబోతున్నాడట. రంగస్థలం, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో సుకుమార్ చరణ్, ఎన్టీఆర్ తో గడ్డం లుక్ ట్రై చేశాడు. మహేష్ కూడా ఈ చిత్రం కోసం గడ్డం పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మహర్షి పూర్తి కాగానే

మహర్షి పూర్తి కాగానే

మహేష్ బాబు ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మాణంలో మహేష్ ఇప్పటికే శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X