మహేష్ బాబుకు ప్లాప్ హీరోయిన్.. అలాంటి కథే సిద్ధం చేసిన సుకుమార్ !
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. రైతు సమస్యల నేపథ్యంలో వంశి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు స్టూడెంట్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా, రైతు సమస్యలని మోడ్రన్ పద్దతులలో పరిష్కరించే వ్యక్తిగా నటిస్తున్నాడు. మహర్షిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా మహేష్ బాబు సుకుమార్ దర్శత్వంలో నటించే చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

మహేష్ ఒప్పుకోలేదు
రంగస్థలం చిత్రం విడుదల కాగానే సుకుమార్ దర్శత్వంలో నటించేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహేష్ కోసం సుకుమార్ ఓ పీరియాడిక్ డ్రామాని సిద్ధం చేశాడు. కానీ ఆ కథకు మహేష్ ఆసక్తిచూపలేదని ప్రచారం జరిగింది. దీనితో మహేష్, సుకుమార్ చిత్రం మరింత ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ సుకుమార్ వేగంగా మహేష్ కోసం మరో కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అలాంటి కథేనా
ఈ సారి సుకుమార్ మైండ్ గేమ్ తరహాలో సాగే కథని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథ మహేష్ కు బాగా నచ్చిందంట. దీనితో సుకుమార్ తదుపరి కార్యక్రమాలతో బిజీ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం 1 నేనొక్కడినేలో కూడా ఊహించని ట్విస్ట్ లో ఆడియన్స్ ని తికమక పెట్టే అంశాలు చాలానే ఉంటాయి. సుకుమార్ మళ్ళీ అదే తరహా కథ సిద్ధం చేశాడా అని మహేష్ ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది.

ప్లాప్ హీరోయిన్
సుకుమార్ చిత్రాల్లో ఎక్కువగా స్టార్ నటీనటులే కనిపిస్తారు. మహేష్ సినిమా కోసం సుకుమార్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రం విజయం సాధించింది. కానీ మహేష్, రకుల్ నటించిన స్పైడర్ చిత్రం మాత్రం దారుణంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

మహర్షి తర్వాత
సుకుమార్, మహేష్ చిత్రం మహర్షి పూర్తి కాగానే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివతో మహేష్ మూడవ చిత్రం ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మహేష్, సుకుమార్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.


Click it and Unblock the Notifications











