అందుకే అజ్ఞాతవాసి ఫట్, ‘అరవింద’, ‘అల’ హిట్స్.. ఆ ఒక్క నిర్ణయమే అంతా మార్చేసిందట

ఏ రంగంలోనైనా ఒడిదొడుకులు సహజమే. సినీ రంగమూ దానికి అతీతం కాదు. ఎంత పెద్ద వారినైనా విజయాలు, అపజయాలు పలకరిస్తూ ఉంటాయి. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను 'అజ్ఞాతవాసి' భయపెట్టింది. కేవలం ఆయన్ను మాత్రమే కాదు మొత్తం సినీ రంగాన్ని షేక్ చేసింది. త్రివిక్రమ్ నుంచి అలాంటి డిజాస్టర్ చిత్రాన్ని ఎవ్వరూ ఊహించలేదు. అయితే వెనువెంటనే మళ్లీ సర్దుకుని.. హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. దాని వెనుకున్న కారణం తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

కారణం తెలుసుకున్న త్రివిక్రమ్..

కారణం తెలుసుకున్న త్రివిక్రమ్..

ఎవరైనా సరే ఓ భారీ డిజాస్టర్‌ను చవిచూశాక అంత త్వరగా కోలుకోలేరు. అదే బాధలో ఉండిపోతారు. కానీ త్రివిక్రమ్ మాత్రం అలా కాదు.. ఎంత పెద్ద డిజాస్టర్ ఇచ్చాడో అంతకు మించి ఇండస్ట్రీ హిట్‌ను ఇచ్చాడు. ఆ సినిమా పోవడానికి, ఈ సినిమాలు ఆడటానికి కారణాన్ని తొందరగా కనిపెట్టి తన కెరీర్‌ను సేఫ్ జోన్‌లో పెట్టుకున్నాడని టాక్.

వాస్తు లోపమే కారణమట..

వాస్తు లోపమే కారణమట..

త్రివిక్రమ్ చాలా ఫాస్ట్‌గా బౌన్స్ బ్యాక్ అవ్వటానికి కారణం వాస్తు అంటున్నారు! అవును ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. ఇదే నిజమని టాక్ నడుస్తోంది. వాస్తు వల్లే 'అజ్ఞాతవాసి' చిత్రం పోయిందట... అప్పట్లో త్రివిక్రమ్ ఉంటోన్న గృహం, వాస్తు శాస్త్ర నియమాలకు వ్యతిరేకంగా, కొంత భాగం నిర్మించారట.

కొత్తగా మళ్లీ నిర్మాణం..

కొత్తగా మళ్లీ నిర్మాణం..

వాస్తు నియమాలకు వ్యతిరేకంగా కట్టడంతోనే 'అజ్ఞాతవాసి' అడ్డంగా బుక్కైపోయిందట. వాస్తు దోషం పోయేలా తన ఇంట్లోని కొంత భాగం కూల్చి మళ్లీ కట్టించాడట.. అందుకే అరవింద సూపర్ హిట్ అయితే.. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అయిందట.

Recommended Video

Agnyaathavasi Effect : Nithin Ignores Trivikram
నాన్ బాహుబలి వైపు..

నాన్ బాహుబలి వైపు..

అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేస్తుండగా.. ఓవర్సీస్‌లో ఇప్పటికే భరత్ అనే నేను సినిమాను క్రాస్ చేసి రామ్ చరణ్ రంగస్థలంపై కన్నేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X