జోరు పెంచిన అఖిల్.. నెక్స్ట్ మూవీ దర్శకుడు అతడేనా!
అక్కినేని హీరో అఖిల్ కెరీర్ లో తొలి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తొలి ప్రేమ చిత్రంతో వెంకీ దర్శకుడిగా సూపర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Recommended Video

ప్రస్తుతం ఈ దర్శకుడు అఖిల్ తో రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇదిలా ఉండగా ఇకపైగ్యాప్ తీసుకోకూడదని అఖిల్ భావిస్తున్నాడు. వెంకీ అట్లూరి చిత్రం పూర్తైన వెంటనే మరో చిత్రాన్ని ప్రారంభించాలని చూస్తున్నాడు.

అఖిల్ నాల్గవ చిత్రానికి సన్నాహకాలు మొదలైనట్లు తెలుస్తోంది. రచయితగా అనేక సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన గోపి మోహన్ తొలిసారి అఖిల్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోపి మోహన్ చెప్పిన కథ అఖిల్ ను నచ్చినట్లు సమాచారం. గోపి మోహన్ గతంలో నాగార్జున కింగ్, సంతోషం వంటి చిత్రాలకు పనిచేశారు.


Click it and Unblock the Notifications











