Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్ బాస్3 హోస్ట్ ఎవరు.. జోరందుకున్న ప్రచారం!
113 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్ 2 గత ఆదివారంతో ముగిసింది. ఈ షోకు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. విజేతగా కౌశల్ నిలిచాడు. దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణ పొందుతున్న షో బిగ్ బాస్. సీజన్ 2 ముగియడంతో అప్పుడే సీజన్ 3 గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. తొలి రెండు సీజన్ లని మించేలా సీజన్ 3 ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాని ఉండకపోవచ్చు
నేచురల్ స్టార్ నాని ఈ సీజన్ లో హోస్ట్ గా ఆకట్టుకున్నాడు. ఆడియన్స్ ని అలరిస్తూనే ఇంటి సభ్యుల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. కానీ సీజన్ 3కి కొనసాగే ఆలోచనలో నాని లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీం కొత్త హోస్ట్ ని వెతుక్కోక తప్పదు.
వైరల్ అవుతున్న న్యూస్
సోషల్ మీడియాలో మాత్రం సీజన్ 3 ఎన్టీఆర్ హోస్ట్ గా మారబోతున్నాడంటూ బలంగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ అభిమానులు పోస్ట్ పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో తెలుగులో బిగ్ బాస్ షో కు మంచి హైప్ వచ్చింది.
మొదటి ఛాయిస్
సీజన్ 3 కోసం బిగ్ బాస్ టీంకు ఉన్న మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్. తొలిసీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం ఎలాగూ ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జరుగుతోంది.
యంగ్ సెన్సేషన్
టాలీవుడ్ నయా సెన్సేషన్ విజయ్ దేవరకొండతో బిగ్ బాస్ టీం ప్రయోగం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎన్టీఆర్ అంగీకరించకపోతే బిగ్ బాస్ టీం ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఆ జాబితాలో రానా, అల్లు అర్జున్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.