మహేష్, నరేష్ స్నేహితులే.. చాలా తేడా ఉంది, నిజమేనా!
సూపర్ స్టార్ మహేష్ నటించబోయే 25 వ చిత్రంకు అంతా సిద్ధం అవుతోంది. భరత్ అనే నేను వంటి భారీ విజయం తరువాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతుండడంతో ఈ చిత్రం ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో అల్లరి నరేష్.. మహేష్ స్నేహితుడిగా కీలక పాత్రలో నటించబోతున్నాడు.
వీరిద్దరికి పాత్రలకు సంబందించిన సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు ధనవంతుడిగా కనిపిస్తాడట. అల్లరి నరేష్ నిరుపేదగా కనిపిస్తాడట. వీరి మధ్య స్నేహం ఎలా మొదలైంది.. బాల్యం నుంచే స్నేహితులా అనే విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

జరుగుతున్న ఈ ప్రచారంలో ఎంతమేరకు వాస్తవం ఉందొ తెలియాల్సి ఉంది. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన హాట్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











