సాహో తరువాత ప్రభాస్ సినిమా..1970 నాటి కథ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరగా నటించిన బాహుబలి 2 చిత్రం విడుదలై ఏడాదికి పైగా గడచిపోయింది. ప్రస్తుతం నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్ర విడుదల ఎప్పుడనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recommended Video

కాస్త సాహో విషయాన్ని పక్కన పెడితే ప్రభాస్ తదుపరి నటించే చిత్రం గురించి సమాచరం అందుతోంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు తెలుస్తోంది. కథ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.

ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం 1970 నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యేలా ఈ చిత్రం ప్రేమ కథగా సాగుతుందట. 1970 నాటి పరిస్థితులకు అనుగుణంగా దర్శకుడు సెట్స్ విషయంపై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











