బోయపాటి సినిమాలో రాంచరణ్ పాత్ర.. ఉత్కంఠ రేపే న్యూస్, రాంచరణ్ మూడోసారి!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతవరకు టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయలేదు. సినిమా గురించి మాత్రం సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. తాజగా రాంచరణ్ పాత్ర గురించి తాజగా జరుగుతున్న ప్రచారం ఉత్కంఠ రేపే విధంగా ఉంది.

పోలీస్ ఆఫీసర్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. ఇంతవరకు బోయాపాటి చిత్రంలో హీరోలు మాస్ అప్పియరెన్స్ తో కనిపించారు. కానీ ఈ చిత్రంలో రాంచరణ్ పోలీసులు అధికారిగానే ఉంటూ విలన్లని ఊచకోత కోసే పాత్రలో కనిపిస్తాడట.

కథ ఇదే అంటూ
సినిమా ఆరంభంలోనే చరణ్ పోలీస్ అధికారిగా సస్పెండ్ అవుతాడు. అప్పటినుంచి అతడి సీక్రెట్ ఆపరేషన్ కొనసాగుతుందట. ఇంటర్వెల్ బ్లాక్ లో భారీ యాక్షన్ సన్నివేశంతో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుందని, ఇదే ఈ చిత్ర కథ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందొ తేలాల్సి ఉంది.

మూడవ సారి
ఇదే కనుక నిజమైతే రాంచరణ్ మూడవసారి పోలీస్ గెటప్ లో నటించబోతున్నట్లు అవుతుంది. గతంలో రాంచరణ్ తుఫాన్, ధృవ చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించాడు. తుఫాన్ చిత్రం నిరాశపరిచినా ధృవ చిత్రం మంచి విజయం సాధించింది.

సంక్రాంతికి
2019 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











