twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా కథతో మేనల్లుడు.. మరో విభిన్న ప్రయోగం!

    |

    Recommended Video

    Sai Dharam Tej to Remake Chiranjeevi Movie

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల కాలంలో తేజు సరైన కథలు ఎంచుకోకపోవడంతో వరుసగా ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని కరుణాకరన్ దర్శకత్వంలో తేజు నటిస్తునాడు. తేజ్ ఐ లవ్ యు అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టొరీగా రాబోతోంది. ఇదిలా ఉండగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కుడా తేజు నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది.

     హిట్ కోసం ఆరాటం

    హిట్ కోసం ఆరాటం

    కెరీర్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన సాయిధరమ్ తేజ్.. ఆ తరువాత వరుస పరాజయాలు చవిచూశాడు. మిగిలి మెగా ఫ్యామిలిలో ఫ్యూచర్ స్టార్ గా చెప్పబడిన తేజు బాగా వెనుకబడిపోయాడు.

    తేజ్ ఐ లవ్ యు

    తేజ్ ఐ లవ్ యు

    ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యు. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

     కిషోర్ తిరుమల దర్శకత్వంలో

    కిషోర్ తిరుమల దర్శకత్వంలో

    మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజు నటించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం గురించి ఆసక్తికరైన ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం చంటబ్బాయ్ స్పూర్తితో ఈ చిత్రం రాబోతునట్లు తెలుస్తోంది.

    విభిన్న ప్రయోగం

    విభిన్న ప్రయోగం

    కమర్షియల్ చిత్రాలు పెద్దగా కలసి రాకపోవడంతో తేజు విభిన్నంగా ప్రయత్నిస్తున్నాడు. చంటబ్బాయ్ చిత్రంలో మెగాస్టార్ చిరు తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. తేజు కూడా ఈ చిత్రంలో తనలోని కామేడి యాంగిల్ ని బయటకు తీయాలని భావిస్తునట్లు తెలుస్తోంది.

    English summary
    Interesting news on Saidharam Tej and Kishore Tirumala movie. Saidharam Tej doing new experiment
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X