ఇదీ విజయ్ దేవరకొండ క్యారెక్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్
వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సినిమా సినిమాకు తన క్యారెక్టర్ మారుస్తూ వస్తున్న ఈ యంగ్ హీరో.. అదే బాటలో తన కొత్త సినిమా లోనూ మరో డిఫెరెంట్ చేయబోతున్నాడట. విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకొచ్చిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డియర్ కామ్రేడ్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసేందుకు ఏకంగా ముగ్గురు అందాల భామలు ఎన్నికవడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. చాలా రోజుల పాటు ఇక్కడే తిష్ట వేసి లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ జరిపేలా ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ రైటర్ గా కనిపిస్తాడట. మూడు కథలు ప్రేక్షకులకు చెబుతూ ఆ మూడింటిలోనూ తనే కథానాయకుడిగా కనిపించడం ఈ చిత్రం లోని అసలు ట్విస్ట్ అని అంటున్నారు. ఒక కథను మరో కథకు కెనెక్షన్ పెడుతూ సినిమా అంతా రసవత్తరంగా సాగేలా ఈ కథను రెడీ చేశారట డైరెక్టర్ క్రాంతి మాధవ్. తెలుగు సినిమాల్లో ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఇలాంటి పాత్రను విజయ్ దేవరకొండ సెలెక్ట్ చేసుకున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్టే.
ఇటీవలే ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ లుక్ బయటకు రావడం, అది కాస్త వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఆయన క్యారెక్టర్ విషయం పై కూడా వస్తున్న వార్తలు ప్రేక్షకుల్లో ఆతృతను నింపుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











