ఇంట్రెస్టింగ్ న్యూస్.. సాహోలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే..!

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టైమ్ రానేవచ్చింది. ఆగస్టు 30 వ తేదీన ప్రభాస్ హీరోగా రూపొందిన మరో భారీ సినిమా 'సాహో' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పట్ల వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై ఉన్న హైప్ రెట్టింపు చేస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో సాహోలో ప్రభాస్ రోల్‌కి సంబందించిన విషయంపై ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని.. దొంగ, పోలీస్ రెండు క్యారెక్టర్లలో ప్రభాస్ కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదే ప్రభాస్ క్యారెక్టర్.. ఇందులో ప్రభాస్ కి సంబందించిన ఒక షేడ్ అండర్ కవర్ కాప్ పాత్ర పేరు అశోక చక్రవర్తి అని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. హీరోయిన్ శ్రద్ద కపూర్ కూడా డ్యూయల్ రోల్ చేస్తోందట. అయితే ఈ ఆసక్తికి తెరపడాలంటే ఆగస్టు 30వ తేదీ రావాల్సిందే మరి.

Interesting News.. Prabhas Role in Saaho

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X