బాలకృష్ణ - గోపిచంద్.. ఎన్టీఆర్ వల్లే ఆ ప్రాజెక్ట్ రివర్స్!
ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా చాలా వరకు సినిమా కథలు మొదట చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతాయి. కొన్నిసార్లు ఆ కథలు తెరపైకి వచ్చినప్పటికీ ఊహించని రిజల్ట్ ని అందుకుంటాయి. ఇకపోతే రెండు ప్రాజెక్టులు ఇద్దరి స్టార్ హీరోల మధ్య దోబూచులాడినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ఒక హీరోకు సెట్టయ్యింది. కానీ దర్శకుడి మిస్టేక్ వల్ల మంచి కాంబినేషన్ మిస్ అయినట్లు సమాచారం.

గోపిచంద్ - బాలకృష్ణ..
గోపిచంద్ - బాలకృష్ణ.. ఈ రెండు పేర్లు పక్క పక్కనే ఉండడం చూస్తుంటే కాస్త స్పెషల్ గానే అనిపిస్తోంది. అందరు అనుకున్నట్లు మల్టీస్టారర్ ప్లాన్ ఏమి జరగలేదు. ఒక యాక్షన్ లవ్ స్టోరీ మాత్రం గోపిచంద్ నుంచి బాలకృష్ణకి బాలకృష్ణ నుంచి మళ్ళీ గోపిచంద్ కి.. ఇలా పలుమార్లు కథా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

రూలర్ గోపిచంద్ చేయాల్సిందట..
గోపిచంద్ తో ఆంధ్రుడు వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన పరుచూరి మురళి మొదట రూలర్ కథను గోపిచంద్ కి వినిపించాడట. కానీ గోపి ఒప్పుకోక పోవడంతో ఆ కథ బాలకృష్ణ దగ్గరకు వెళ్లింది. ఇక ఆ సినిమాను తమిళ్ దర్శకుడు ks.రవికుమార్ తెరకెక్కించాడు. అయితే సినిమా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

మరోసారి..
ఇక మరోసారి కూడా ఒక కథ ఇద్దరి హీరోలను టచ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ సారి బాలకృష్ణ నో చెప్పగా గోపిచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు కారణం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు తేజ నెక్స్ట్ గోపిచంద్ తో అలివేలు వెంకట రమణ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అసలైతే ఈ సినిమాను మొదట బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట.

ఎన్టీఆర్ కారణంగా..
కానీ దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వ్యవహరించిన తీరుకు బాలయ్య ఆయనపై చాలానే అసంతృప్తితో ఉన్నాడట. అందుకే మొదట అలివేలు వెంకటరమణ ఆయనకు వినిపించినప్పటికి చేయలేను అని చెప్పేశాడట. కథ విన్న తరువాత నచ్చక రిజెక్ట్ చేశాడేమో అనే మరొక కామెంట్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఇద్దరి యాక్షన్ హీరోల దగ్గర నుంచి రెండు కథలు ఇలా రివర్స్ అవ్వడం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











