ప్రభాస్ 'రాధేశ్యామ్'.. మరో ఇంట్రెస్టింగ్ గాసిప్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ఇటీవల ఆ అంచనాల డోస్ ని మరింత పెంచేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా రెబల్ స్టార్ ఒక డిఫరెంట్ అడ్వెంచర్ లవ్ స్టోరీతో అభిమానుల ముందుకు రాబోతున్నట్లు అర్ధమవుతోంది.
చరిత్రలో ఎన్నో కథలతో పాటు రాధేశ్యామ్ కూడా ఒక సంచలన ప్రేమ కథ అనేలా ప్రజెంట్ చేయనున్నారట. ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. దర్శకుడు కె.రాధాకృష్ణ ఈ సినిమా కథలో జ్యోతిష్యం, అలాగే సైన్స్ కి సంబంధించిన పాయింట్స్ ని కూడా హైలెట్ చేయనున్నారట. కాలంతో సాగే ఎన్నో ప్రేమ కథలతో రాధేశ్యామ్ ప్రేమ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుందని టాక్ వస్తోంది.

అంటే చరిత్రలో చారిత్రాత్మక ప్రేమ కథలకు రాధేశ్యామ్ కథకు చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయట. అందులోనే దైవానికి సంబంధించిన జ్యోతిష్య కారణాలను అలాగే సైన్స్ కి సంబంధించిన విషయాలను కూడా హైలెట్ చేస్తారట. చాలా సెన్సిటివ్ గా సాగే ప్రేమ కథలో యాక్షన్ సన్నివేశాలు ఉండవని ఒక రూమర్ అయితే వైరల్ అవుతోంది. బాహుబలి లాంటి ప్రభాస్ రాధేశ్యామ్ లో కనీసం చెంప దెబ్బ కూడా కొట్టదని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











