అసురన్ రీమేక్.. వెరైటీ టైటిల్‌తో వెంకీ

తమిళ నాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. సహజత్వానికి దగ్గరగా వెట్రి మారన్ తెరకెక్కించిన అసురన్‌లో.. అంతే సహజంగా నటించిన ధనుష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అతడి కెరీర్‌లోనె బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి.. దాదాపు 150కోట్లను కొల్లగొట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన అసురన్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

తమిళ నాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న అసురన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. వెంకటేష్ హీరోగా.. అక్కడ మంజువారియర్ చేసిన పాత్రను ప్రియమణి పోషించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 Interesting Title For Asuran Telugu Remake

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇటీవలే సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అనంతపురంలో చిత్రీకరిస్తున్నట్లు సమచారం. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటారని టాక్. ఈ సినిమాకి 'నారప్ప'అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X