సమంత, నాగచైతన్య కలసి నటించే సినిమాకు టైటిల్ అదేనా!
రియల్ లైఫ్ లో వివాహ బంధంతో ఒక్కటైన తరువాత సమంత, నాగచైతన్య కలసి తొలి సారి నటించబోతున్నారు. వివాహానికి ముందు వీరు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తాజాగా తెరకెక్కబోయే చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రంలో సమంత, నాగ చైతన్య భార్య భర్తలుగా నటిస్తారు.
ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన టైటిల్ ప్రచారం జరుగుతోంది. మజిలి అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

నిన్ను కోరి చిత్రంతో శివ నిర్వాణ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో చైతు, సమంత కలసి ఏం మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాల్లో నటించారు. పెళ్ళైన తరువాత తొలి చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.


Click it and Unblock the Notifications











