అల్లు అరవింద్ స్కెచ్.. ప్రభాస్, ఎన్టీఆర్ కలయికలో భారీ మూవీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Recommended Video

Interesting Update,Is Prabhas & Jr NTR Multi-Starrer On Cards ? || Filmibeat Telugu

భారత దేశ సినీ పరిశ్రమలో 'రామాయణ' రూపంలో మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టబడిన సంగతి తెలిసిందే. దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్, ఉన్నత విలువలతో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా నిర్మాణంలో ముగ్గురు నిర్మాతలు భాగం కానుండగా.. అందులో ఒకరిగా టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఉండటం ఆసక్తికర అంశం. అయితే తాజాగా అల్లు అరవింద్ వేసిన స్కెచ్ ఇదీ.. అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకీ ఆ బడా నిర్మాత వేసిన స్కెచ్ ఏంటి? వివరాల్లోకి పోతే..

ఇద్దరు డైరెక్టర్లు.. ముగ్గురు నిర్మాతలు

ఇద్దరు డైరెక్టర్లు.. ముగ్గురు నిర్మాతలు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇద్దరు డైరెక్టర్లు రామాయణ సినిమాను తెరకెక్కించబోతున్నారు. 'దంగల్' ఫేం నితేశ్ తివారీ, శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన 'మామ్' డైరెక్టర్ రవి ఉద్యవార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచ ఆడియన్స్ టార్గెట్‌గా భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సహా నమిత్ మల్హోత్రా, మధు మంతెన ఈ సినిమా నిర్మాణంలో భాగం కానున్నారు.

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రామాయణ.. ప్రభాస్, ఎన్టీఆర్

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రామాయణ.. ప్రభాస్, ఎన్టీఆర్

ఇటీవలే ప్రకటించబడిన రామాయణ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మొత్తం మూడు పార్టులుగా రూపొందించ బోతున్న రామాయణ సిరీస్ మొదటి భాగాన్ని 2021లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా లీడ్ రోల్స్ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ ల పేర్లు బయటకు రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

రౌద్రపూర్తిమైన పాత్ర.. ఎన్టీఆర్

రౌద్రపూర్తిమైన పాత్ర.. ఎన్టీఆర్

రౌద్రపూర్తిమైన రావణుడి పాత్రను ఎన్టీఆర్‌తో చేయించాలని యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పలు సినిమాల్లో రావణుడిగా అదరగొట్టాడు.. అలాగే ఇటీవల వచ్చిన జై లవకుశ సినిమాలో రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్ చించేశారు. ఈ నేపథ్యంలో రావణుడి పాత్ర ఎన్టీఆర్‌కి మాత్రమే సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

రాముడి కోసం అల్లు అరవింద్ స్కెచ్

రాముడి కోసం అల్లు అరవింద్ స్కెచ్

రామాయణ అంటే ముందుగా గుర్తొచ్చేది రాముడు, రావణుడే. దీంతో ఈ రెండు పాత్రల అప్‌డేట్ కోసమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే రాముడిగా రామ్ చరణ్‌ని సంప్రదించగా, ఆయన ఓకే చెప్పలేదని తెలిసింది. దీంతో ఆ పాత్ర ప్రభాస్ తో చేయించాలని అల్లు అరవింద్ స్కెచ్ వేస్తున్నాడని సమాచారం అందుతోంది.

ప్రభాస్, ఎన్టీఆర్‌లు రెడీనా

ప్రభాస్, ఎన్టీఆర్‌లు రెడీనా

నిజానికి ఇలాంటి భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలు భాగమైతే ఇక జరిగే సంచలనాలు ఊహించగలమా? చెప్పండి. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నారు. ఓ వైపు RRR షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు కన్ఫర్మ్ చేసుకున్నారు ఎన్టీఆర్. మరోవైపు ప్రభాస్ కూడా తన తన సినిమాలకు కమిట్‌మెంట్ ఇచ్చి ఉన్నాడు. సో చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X