RC 15 :. శంకర్ సినిమా నుంచి లీకులు.. మరో స్టార్ హీరోయిన్.. చరణ్ పాత్ర రివీల్?..
ఒక రకంగా రామ్ చరణ్ RRR సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. కానీ తరువాత ఆయన కీలక పాత్రలో నటించిన ఆచార్య సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తన 15వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శంకర్ షణ్ముగం తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.. అయితే ఈ సినిమాలో ఆయన ఒక నిజాయితీ గల అధికారి పాత్రలో నటిస్తున్నాడు అని ప్రచారం జరిగింది కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. రెండు పూర్తి భిన్నమైన పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది.
అందులో ఒక పాత్రకు గాను షార్ట్ టెంపర్ కలిగి ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడని ఆ పాత్రకు కొన్ని వింత మేనరిజమ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. మరో పాత్రలో రామ్ చరణ్ ఒక గ్రామ స్థాయి రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. దర్శకుడు శంకర్ ఈ రెండు పాత్రలు కూడా చాలా కీలకంగా ఉండేలాగా ప్లాన్ చేశాడని షార్ట్ టెంపర్ కలిగిన వ్యక్తిగా రామ్ చరణ్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని ఆ పాత్ర కీర్తి సురేష్ పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ కథను అందించగా తెలుగు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నారు.

అంజలి, సునీల్, జయరాం, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుమారు 170 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆచార్య సినిమా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తిరు ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సమీర్ మొహమ్మద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారు అనే విషయం మీద క్లారిటీ లేదు. బహుశా శంకర్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











