‘సరిలేరు నీకెవ్వరు’లో ఆ 30 నిమిషాలు మామూలుగా ఉండదట.!
తన గత చిత్రం 'మహర్షి' సూపర్ సక్సెస్ అవడంతో జోష్ మీదున్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఈ ఫలితంతో అదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే.. 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అలాగే, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.
మహేశ్ బాబు వరుసగా సీరియస్ మోడ్ సినిమాలే చేస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుండడంతో అతడి ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. దీంతో ఈ సారి మాంచి కామెడీ సినిమాను అందించాలని మహేశ్ ఆలోచించాడని, ఇందులో భాగంగానే అనిల్ రావిపూడి కథను ఓకే చేసేశాడని ఆ మధ్య ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరిగింది.

ఈ సినిమాలో ఆర్మీ మేజర్‌గా కనిపిస్తున్నందున మహేశ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఇది కూడా సీరియస్‌గా నడిచే సినిమానే అనుకున్నారు. అయితే, తాజాగా వచ్చిన రిపోర్టులను బట్టి.. ఈ సినిమాలో సీరియస్‌నెస్ ఉంటూనే, కామెడీ ఎపిసోడ్స్ కూడా ఉంటాయట. ఇందులో ఏకంగా 30 నిమిషాల కామిక్ ఎపిసోడ్ ఉంటుందని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
గతంలో ఈ సూపర్ స్టార్ చేసిన 'ఖలేజా', 'దూకుడు', 'ఆగడు' సినిమాల్లో కామెడీ ప్రధాన భూమిక పోషించింది. ఇప్పుడు ఇది కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతుండడంతో మహేశ్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ పని చేస్తోంది.


Click it and Unblock the Notifications











