బోయపాటి, బాలయ్య మూవీ.. ఇంటరెస్టింగ్ అప్డేట్!
బోయపాటి శ్రీను, బాలయ్య సూపర్ హిట్ కాంబినేషన్ లో మూడో చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ వంటి చిత్రం ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామచరణ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
Recommended Video

ఈ ప్రాజెక్ట్స్ పూర్తైన తరువాత బాలయ్య, బోయపాటి సినిమా పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ గురించి మరో ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ మేరకు మైత్రి సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల రంగస్థలం చిత్రంతో భారీ విజయం ఈ సంస్థ ఖాతాలో పడింది. అదే ఉత్సాహంతో మరిన్ని భారీ చిత్రాలు నిర్మించే పనిలో నిర్మాతలు బిజీ అయ్యారు.


Click it and Unblock the Notifications











