ఎన్టీఆర్ బయోపిక్: చంద్రబాబు ఓకే.. ఆయన సంగతేంటి, స్టార్ హీరోనేనా!
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతోంది. బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం దర్శకుడు క్రిష్ భారీ తరగణాన్ని ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. మరో వైపు షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారందరి పాత్రలో ఎవరెవరు నటించబోతున్నట్లు అనే ఉత్కంఠ నెలకొని ఉంది.
Recommended Video


చంద్రబాబు ఓకే
ఎన్టీఆర్ కు అల్లుడు అయిన తరువాత చంద్రబాబు రాజకీయాల్లో కీలకంగా మారారు. టిడిపి అధినేతగా ఎదిగారు. చంద్రబాబు పాత్ర కోసం స్టార్ హీరో రానాని ఎంపిక చేసుకున్నారు. చంద్రబాబు పాత్ర కోసం రానా సరైన ఛాయిస్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్ద అల్లుడు ఎవరు
ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి ఆయన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించడంలో ఆయన ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత చంద్రబాబు టిడిపిలోకి వచ్చారు. వెంకటేశ్వరరావు పాత్ర కోసం సరైన నటుడిని అన్వేషించే ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది.

మరో స్టార్ హీరో
వెంకటేశ్వర రావు పాత్రకోసం మరో స్టార్ హీరోని ఎంపిక చేసుకోవాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రమంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి భారీ తనం పెరుగుతోంది. స్టార్ నటీనటులు క్రమంగా ఈ చిత్రానికి అంగీకరిస్తున్నారు.

భారీ అంచనాలు
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రానా, రకుల్ ప్రీత్ సింగ్, సుమంత్ వంటి నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సినీరాజకీయ జీవితంలో ముఖ్య ఘట్టాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











