త్రివిక్రమ్ కోసం స్పెషల్ డేట్ ఫిక్స్ చేసుకున్న తారక్.. ఫస్ట్ లుక్, టైటిల్ కూడా అప్పుడే?
మొత్తానికి మూడు నెలల తరువాత RRR షూటింగ్ మొదలు కాబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి మళ్ళీ పూర్తిగా కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ సీన్స్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ తో షూట్ చేయాల్సిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయట. గతంలో ఎప్పుడు లేని విధంగా తారక్ కొమురమ్ భీమ్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. తారక్ ఆ సినిమా అనంతరం త్రివిక్రమ్ తో తన 30వ ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఆ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాజమౌళికి తారక్ తో చాలా పనుంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే సినిమాను స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ చాలా ప్లాన్స్ వేసుకున్నారు. కానీ రాజమౌళి తన సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని ఆర్టిస్టులను వదలడం లేదు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ టీజర్ కోసం కొన్ని రోజులు గ్యాప్ లేకుండా పని చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఫైనల్ గా త్రివిక్రమ్ సినిమా కోసం తారక్ ఒక ఫైనల్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దసరా రోజు సినిమాను స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారట. అప్పుడే సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్ ని కుదిరితే టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











