అల్లు అర్జున్ తో KGF డైరెక్టర్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్
KGF చాప్టర్ 1 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమాను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. చాప్టర్ 2 ఇంకా రిలీజ్ ఇవ్వకముందే ఈ టాలెంటెడ్ దర్శకుడు వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. సలార్ అనంతరం ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అందుకోసం ప్రశాంత్ నీల్ కు మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు టాక్ వస్తోంది. ఇక ఇప్పుడు మరో హీరోతో న్యూ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ కూడా భవిష్యత్తులో పాన్ ఇండియా దర్శకులతోనే ఎక్కువగా వర్క్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. అందుకే ఇటీవల ప్రశాంత్ నీల్ తో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఇటీవల నిర్మాత బన్నీ వాసు కూడా ఆ కాంబినేషన్ పై కామెంట్ చేశారు. భవిష్యత్తులో గీత ఆర్ట్స్ లో బన్నీ, ప్రశాంత్ నీల్ సినిమా ఉండవచ్చని చెబుతూ.. కొన్ని పాయింట్స్ మీద చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని బన్నీ వాసు వివరణ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ డివివి.దానయ్య ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











