మహేష్ బాబు 27 అప్‌డేట్.. రంగంలోకి దిగిన బడా సంస్థ
వరుస సినిమాలతో సూపర్ జోష్‌లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన కెరీర్‌లో ఇప్పటికే 25 సినిమాలు పూర్తిచేసిన ఆయన ప్రస్తుతం 26వ సినిమా సెట్స్‌పై చురుకుగా కదులుతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.
కాగా మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ జరుగుతుండగానే మహేష్ 27 కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. మహేష్ తన తర్వాతి సినిమా మరోసారి వంశీ పైడిపెల్లి దర్శకత్వంలోనే చేయబోతున్నారట. మహర్షి సినిమా షూటింగ్ సమయంలోనే ఈ అగ్రిమెంట్ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టే విషయమై పీవీపీ, దిల్ రాజు, మహేష్ స్వయంగా చేపప్పనున్నారని వార్తలు వచ్చాయి. వీలైతే తనే సోలోగా మహేష్ 27 సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని దిల్ రాజు భావించారని తెలిసింది.

కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు బడా సంస్థ సోనీ.. మహేష్ 27 నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకొచ్చిందని తెలిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ యాజమాన్యం డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సంప్రదింపులు జరిపారని ఫిలిం నగర్ టాక్. భారీ బడ్జెట్ కేటాయించి అన్నీ హంగులతో తాము మహేష్ 27 ప్రాజెక్టు నిర్మిస్తామని మాటిచ్చారట. అయితే దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ త్వరలోనే ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మహేష్ 27 మూవీ రెగ్యులర్ షూటింగుకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











