twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నానికి యమ చిరాకు.. ఆ వేషాలు మాత్రం మామూలు కాదండోయ్!

    |

    నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కడుతున్నారు.

    కథ ప్రకారం ఈ సినిమా ఐదుగురు మహిళలతో కూడిన ఓ గ్యాంగ్‌కి లీడర్‌గా నాని ఉంటాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజమేనని తేల్చేసింది ఇటీవల విడుదలైన 'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ లుక్ పోస్టర్. భిన్న వయసులు ఉన్న మహిళలు నాని గ్యాంగ్ లో ఉంటారని తెలిపింది ఈ లుక్. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ గ్యాంగ్ రివెంజ్‌తో కూడిన కామెడీ చేస్తుందని, అందులో గ్యాంగ్ లీడర్ నాని వేసే వేషాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తోంది. చిత్రంలో నాని క్రైమ్ రైటర్‌గా కనిపిస్తాడట. నాని క్యారెక్టర్ అమాయకత్వంతో కుడి ఉంటుందట. చిరాకుతో కూడిన స్వభావంతో నాని డిఫరెంట్ కామెడీ యాంగిల్ చూపించనున్నాడని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ నాని కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.

    Interesting Update On Nanis Gang Leader

    జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని కెరీర్ లో రాబోతున్న సినిమా గ్యాంగ్ లీడర్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జులై 24 న టీజర్ రిలీజ్ చేసి.. ఆగస్ట్ 30 వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

    English summary
    After Jersey.. hero Nani's next movie is Gang Leader. The movie has fixed Release Date also. As per latest news in this movie nani charecter is much different then his previous movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X