ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ హేటర్స్ కుళ్ళుకోవాల్సిందే.. ఆ హీరోతో మల్టీస్టారర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అతి త్వరలో బ్యాక్ టూ బ్యాక్ సెలబ్రేషన్స్ తో బిజీ కానున్నారని చెప్పవచ్చు. రాజకోయల్లోకి వెళ్ళాక పవన్ సినిమాలకు దురమవుతాడెమోనని చాలా మంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ ఆయన వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. అలాగే మరో రెండు సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఒక సినిమాకు సంబంధించిన గాసిప్ అభిమానులకు మంచి కిక్కిస్తోంది.

మొదట్లో ఎవరు నమ్మలేదు..
ఒక రూమర్ నిజమైతే ఆ న్యూస్ ఎంతగా వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన రూమర్స్ కూడా చాలా వరకు నిజమే అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలో వరుసగా సినిమాలను ఎనౌన్స్ చేయనున్నాడు అని రూమర్స్ వచ్చినప్పుడు మొదట్లో ఎవరు నమ్మలేదు. కానీ ఆ తరువాత అవే నిజమయ్యాయి.

హీరో కోసం పవన్ చర్చలు
అసలు మ్యాటర్ లోకి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాను కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే మలయాళం రీమేక్ అయ్యప్పన్ కొశీయుమ్ పై కూడా పవన్ ఇటీవల చర్చలు జరిపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులో మరో హీరో పాత్రపై కూడా చర్చలు జరుపుతున్నారు.

నితిన్ అంటున్నారే..?
ఆ మళయాళం కథలో ఇద్దరు స్టార్స్ మేజర్ రోల్స్ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ అఫీసర్ పాత్రకు సెట్టయ్యాడు. ఇక మరో ముఖ్యమైన పాత్ర కోసం ఎవరిని సెలక్ట్ చేయాలనే విషయంలో చిత్ర యూనిట్ గత కొన్ని వారాలుగా చర్చలు జరువుతోంది. ఆల్ మోస్ట్ రానా దగ్గుబాటి సెట్టయ్యాడు అన్నారు. ఇక ఆ లిస్ట్ లో నితిన్ కూడా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.
Recommended Video

ఇది నిజమైతే.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే
ఒకవేళ నితిన్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే గనక హేటర్స్ కి ఇది దిమ్మ తిరిగే న్యూస్ అని కామెంట్స్ వస్తున్నాయి. తనకంటూ ఒక క్రేజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా నితిన్ పవన్ కళ్యాణ్ ని ఎంతగా అభిమాణిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి హీరోతో ఛాన్స్ వచ్చింది అంటే చాలా ఈజీగా ఒప్పుకుంటాడని చెప్పవచ్చు. మరి ఈ రూమర్స్ పై ఒక క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











