twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR కంటే భారీ బడ్జెట్: ప్రభాస్‌తో స్టార్ డైరెక్టర్ వేసిన ప్లాన్ మామూలుగా లేదు!

    |

    బాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో మాదిరిగా ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలు రావడం లేదనేది వాస్తవం. సరైన కథ కుదరకపోవడం వల్లనో లేక హీరోల మధ్యన ఉన్న విబేధాల కారణంగానో తెలియదు గాని స్టార్స్ మాత్రం చాలా వరకు వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తగ్గించేశారు. కానీ మన ఇండస్ట్రీలో మాత్రం మళ్ళీ మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది. అయితే బాలీవుడ్ లో ప్రభాస్ ద్వారానే ఒక అగ్ర దర్శకుడు నెవర్ బిఫోర్ అనేలా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

     వార్ బాక్సాఫీస్ హిట్

    వార్ బాక్సాఫీస్ హిట్

    చాలా రోజుల తరువాత వార్ సినిమా ద్వారా ఒక టైప్ ఆఫ్ మల్టీస్టారర్ ప్రాజెక్టు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఆ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

    హృతిక్ రోషన్ తో మరో హీరో

    హృతిక్ రోషన్ తో మరో హీరో


    అసలు మ్యాటర్ లోకి వెళితే వార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ తో మరో యాక్షన్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్ ని మళ్ళీ తీసుకుంటారో లేదో తెలియదు గాని తప్పకుండా మరొక హీరో మాత్రం హృతిక్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడని టాక్ వస్తోంది.

    వార్ లాంటి సినిమాలో ప్రభాస్

    వార్ లాంటి సినిమాలో ప్రభాస్


    మల్టీస్టారర్ సినిమా అయితేనే వార్ అంచనాలను అందుకోగలమని దర్శకుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా తరహాలో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక వార్ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి మరో వార్ లాంటి సినిమాలో హృతిక్ రోషన్ తో ప్రభాస్ ను కలపనున్నట్లు గత కొంతకాలంగా టాక్ వస్తోంది.

    RRR కంటే హై రేంజ్ లో..

    RRR కంటే హై రేంజ్ లో..

    ప్రస్తుతం ఇండియన్ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీగా RRR తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం జక్కన్న 450కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువ రేంజ్ లో దాదాపు 500కోట్లతో యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రభాస్ - హృతిక్ రోషన్ లతో సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    The fact is that these days multistarrer movies are not coming out in the Bollywood industry like in the past. I don't know if it's because of the lack of a proper story or because of the differences between the heroes, but the top heroes have largely cut back on screen sharing with other heroes. Many days later a type of multistarrer by war cinema. The project attracted an audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X