RRR అప్‌డేట్: పేరుకు తగ్గట్టే మూడే మూడు.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు వస్తున్న అప్‌డేట్స్ వారిలో మరింత ఆత్రుత నింపుతున్నాయి.

తాజాగా RRR సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సమాచారం ప్రకారం సినిమా పేరుకు తగ్గట్టే ఇందులో మూడే మూడు పాటలు ఉంటాయని తెలుస్తోంది. అబ్బురపరిచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా బల్గెరియా షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది.

Interesting Update On Rajamoulis RRR

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X