రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్ డేట్.. షాకిచ్చేలా ఇంట్రవెల్ సీన్, హైరేంజ్‌లో యాక్షన్!

Recommended Video

Ram Charan,Boyapati Srinu's Movie Got Intresting News

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు పండగే అని చెప్పొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ కేక పెట్టించే విధంగా ఉంటాయి. ఈ చిత్రంలో కూడా పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర ఇతర విశేషాల గురించి జరుగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.

ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

మీడియా, సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రాంచరణ్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ ఆగష్టు 15 న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. టైటిల్ కూడా అప్పుడే ప్రకటిస్తారు. రాంచరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇంట్రవెల్ సీన్

ఇంట్రవెల్ సీన్

బోయపాటి సినిమా అంటే ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోవాల్సిందే. అద్భుతమైన ట్విస్ట్, భారీ యాక్షన్ తో ఈ చిత్రంలో ఇంట్రవెల్ సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. రాంచరణ్ హీరోయిజాన్ని మరో లెవల్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

తరువాతి షెడ్యూల్‌లో

తరువాతి షెడ్యూల్‌లో

తరువాతి షెడ్యూల్ లో చిత్రానికే హైలైట్ గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం సరైన లొకేషన్ ని వెతికి పెట్టె పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

 60 శాతం

60 శాతం

దర్శకుడు బోయపాటి ఇప్పటికే 60 శాతం షూటింగ్ ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. 2019 సంక్రాంతికి సినిమా విడుదల చేయబోతున్నట్లు ఇది వరకే ప్రకటించారు. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 11 విడుదల తేదీని లాక్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది.

వివేక్ ఒబెరాయ్

వివేక్ ఒబెరాయ్

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండడం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. భరత్ అనే నేను చిత్రంలో మెరిసిన కైరా అద్వానీ ఈ చిత్రంలో మెరుపులు మెరిపించబోతోంది. సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X