Don't Miss!
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- News భక్తులకు గుడ్‌న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శంకర్, రామ్ చరణ్ పాన్ ఇండియా.. రంగంలోకి మరో స్టార్.. ఇక ప్రమోషన్స్ అవసరం లేదు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇతర ఇండస్ట్రీలోని దర్శకులు కూడా మన హీరోలతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడం గర్వించదగ్గ విషయం. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో ఒక బిగ్ బడ్జెట్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
దిల్ రాజు ప్రొడక్షన్ లో..
శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే మొదట ఇది నిజమని నమ్మడానికి సమయం చాలానే పట్టింది. ఫైనల్ గా దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ పై మొదట్లో రూమర్స్ వచ్చినప్పుడు నమ్మడానికి కొంచెం కష్టంగానే అనిపించింది. అబద్దం అని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది.
బడ్జెట్ ఫిక్స్ అయినట్లే..
ఇక సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు కూడా అనేక రకాల రూమర్స్ ఇంకా వస్తూనే ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెయిన్ గా బడ్జెట్ హీరోయిన్ విషయంలో అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల అంచనాలను అందుకునేలా ఉండాలని భారీగా ఖర్చు చేస్తాడని అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాను కూడా కాస్ట్లీగానే ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 150కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని సమాచారం.
హీరోయిన్ గా రష్మిక..?
ఇక సినిమాలో కథానాయిక విషయంపై చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఒక విషయం లీక్ అయ్యింది. సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
అనిరుధ్ వచ్చాడంటే..
ఇక సినిమాపై మరింత అంచనాలు పెంచే మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇండియన్ 2 సినిమా కోసం అనిరుధ్ ను సెలెక్ట్ చేసుకున్న శంకర్ ఇప్పుడు చరణ్ సినిమా కోసం కూడా మళ్ళీ అతన్నే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషనలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ తోనే సినిమాకు బజ్ క్రియేట్ అవ్వడం కాయం.