రామ్ చరణ్ అప్‌కమింగ్ మూవీ.. RRR పూర్తయిన వెంటనే! నిజంగా అతినికి లక్కీ ఛాన్సులే!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత చెర్రీ చేయబోయే ప్రాజెక్టు ఏంటి? అది ఏ డైరెక్టర్‌తో..? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. వివరాల్లోకి పోతే..

ఆరాదీస్తున్న మెగా, నందమూరి ఫ్యాన్స్..

ఆరాదీస్తున్న మెగా, నందమూరి ఫ్యాన్స్..

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది RRR మూవీ. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం మేర షోట్టింగ్ ఫినిష్ అయింది. దీంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు రామ్ చరణ్ అభిమానులు వారి వారి అభిమాన హీరో నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆరా దీస్తున్నారు.

సస్పెన్స్‌లో పెట్టిన రామ్ చరణ్.. చివరకు!

సస్పెన్స్‌లో పెట్టిన రామ్ చరణ్.. చివరకు!

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ మూవీ కప్ఫమ్ కాగా, రామ్ చరణ్ సినిమాపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొరటాల శివ, విక్రమ్ కె కుమార్ లాంటి దర్శకులతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాను ఓకే చేసే ప్రయత్నంలో ఉన్నారని విన్నాం. కానీ తాజా సమాచారం మేరకు చెర్రీ.. తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

అతని పంథానే వేరు.. ప్రూవ్ అయింది కూడా!

అతని పంథానే వేరు.. ప్రూవ్ అయింది కూడా!

సుమంత్‌తో 'మళ్లీ రావా', నానితో 'జెర్సీ' సినిమాలను రూపొందించి ప్రేమ కథా చిత్రాల్లో తన పంథా వేరని నిరూపించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి రామ్ చరణ్ ఛాన్స్ ఇస్తున్నారట. ఇప్పటికే తన స్క్రిప్ట్ రామ్ చరణ్‌కి వినిపించగా ఆయన ఓకే చేశారని తెలుస్తోంది.

ప్యూర్ లవ్ స్టోరీ.. రామ్ చరణ్ ఫిదా

ప్యూర్ లవ్ స్టోరీ.. రామ్ చరణ్ ఫిదా

కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందించాలని గౌతమ్ ప్లాన్ చేస్తున్నారట. ఇది నార్త్ - సౌత్ లవ్ స్టోరీ అని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది. పంజాబీ అమ్మాయి, దక్షిణాది అబ్బాయి మధ్య ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని రాసి చేరికి వినిపించారట గౌతమ్. దీంతో ఫిదా అయిన చెర్రీ.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

NTR 30 : Jr NTR Trivikram Movie Link With Chiranjeevi's Blockbuster Film || Filmibeat Telugu
చెర్రీకి మాటిచ్చిన డైరెక్టర్

చెర్రీకి మాటిచ్చిన డైరెక్టర్

ఎమోషన్స్‌తో కూడిన ఈ కథను మరింత ఆసక్తికరంగా మలుస్తానని చెర్రీకి గౌతమ్ మాటిచ్చారట. ఏదిఏమైనా రామ్ చరణ్ లాంటి హీరోతో గౌతమ్ తిన్ననూరికి ఛాన్స్ దొరికిందంటే నిజంగా చాలా లక్కీ అన్నట్లే కదూ!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X