Just In
- 38 min ago
పెళ్లికి ముందే బ్రేకప్.. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు అలా ఖర్చు చేశా: బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజీ
- 54 min ago
బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి: మరో హాట్ సెల్ఫీతో రచ్చ.. అవి ధరించడం ఇష్టముండదు అంటూ!
- 1 hr ago
సీక్రెట్ ప్లేస్‌లో పవన్ టాటూ: అలా లేపి చూపించిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మడి తీరుకు వాళ్లంతా షాక్!
- 1 hr ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో అనుష్క.. ఈసారి నెవర్ బిఫోర్ అనేలా..
Don't Miss!
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- News
రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్: ప్రధాని మోడీతో పాటు సీఎంలకు: వారికి మాత్రం ఆ తర్వాతే..!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. శంషాబాద్‌లో ఘన స్వాగతం!!
- Lifestyle
మకరంలోకి శుక్రుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం.. ఏ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలొస్తాయంటే..!
- Automobiles
బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR నుంచి సెన్సేషనల్ అప్‌డేట్: పోలీస్ పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్.. అసలు కారణం ఇదే.!
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి పేరును ప్రత్యేకంగా చెప్పుకుంటారు. దీనికి కారణం ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కావడమే. అంతేకాదు, 'బాహుబలి' సిరీస్‌తో జక్కన్న తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేశాడు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. బాహుబలి వంటి బడా హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'RRR'. తాజాగా ఈ సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే....

ఇందులో ఎవరెవరు ఉన్నారో చూడండి
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో RRR ఒకటి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. వీరికి జోడీగా ఒలీవియా మోరిస్, ఆలియా భట్ నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

ఇద్దరు హీరోలనే కాదు వాళ్లను కూడా కలిపాడు
రాజమౌళి తీస్తున్న RRRలో రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు స్టార్లుగా వెలుగొందుతున్న వారు కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అదే సమయంలో ఈ సినిమా వల్ల ఈ రెండు కుటుంబాలకు చెందిన అభిమానులు కూడా ఒక్కటయ్యారు.

రాజమౌళి అదిరిపోయే ప్లాన్లు.. సినిమాకు ప్లస్
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎన్నో ప్లాన్లు వేస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన నటులను తీసుకోవడంతో సినిమాను చాలా మందికి చేరువ చేశాడు. అలాగే, ఈ మూవీలో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ పెట్టడం సహా పలు అంశాల వల్ల బాగా ప్లస్ అవుతోంది.

పోలీస్ పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్
డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న రామ్ చరణ్.. పోలీస్ పాత్రను కూడా పోషించబోతున్నాడట. అవును... ఈ సినిమాలో ఓ కీలకమైన ఎపిసోడ్ కోసం అతడు ఖాకీ దుస్తులు వేసుకుంటున్నాడట. ఇది 5-8 నిమిషాలు ఉంటుందని టాక్.

అల్లూరి.. పోలీస్‌గా ఎందుకు మారుతాడంటే..
రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం తెల్లవాళ్లతో పోరాటం చేశాడు. ఇందులో భాగంగానే అతడు పోలీసులను అంతమొందించడానికి ఆ బట్టలు వేసుకుని వాళ్లతో కలుస్తాడట. అచ్చం పోలీస్‌లానే ఉంటూ వారిలో ఒక్కక్కరినీ చంపేస్తాడని తెలిసింది. ఈ సీన్ మొత్తం అల్లూరి సీతారామరాజు పాత్రకు హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.